iDreamPost
android-app
ios-app

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ మాంధాత సీతారామమూర్తి

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ మాంధాత సీతారామమూర్తి

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు. ఎప్పటి నుంచో కలిగివున్న ఈ స్థానాన్ని వివాద రహితుడు, న్యాయకోవిదుడు అయిన వ్యక్తి ని ప్రభుత్వం నియమించింది. అన్ని రాజకీయ పార్టీల సమీక్ష అనంతరం ఆయనకు ఈ కీలక పదవి కట్టబెట్టింది.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్తిస్థాయి కమిటీ ని సైతం ప్రభుత్వం పూర్తి చేసింది. దీనిలో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు. వీరితో పాటు పూర్తి స్థాయి మానవ హక్కుల కమిషన్ భవనాన్ని సైతం విశాఖలో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఈ కమిషన్ ఏర్పాటుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

న్యాయవ్యవస్థలో అపార అనుభవం..

జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడ. 12 సంవత్సరాల పాటు ఆయన జిల్లాలో న్యాయవాదిగా పనిచేశారు. ఎన్నో కీలక కేసులను వాదించిన అనుభవం ఆయనకు ఉంది .1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బంగారు పతకం.. 

2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా సీతారామమూర్తి పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. అత్యుత్తమ విద్యార్థి గానూ ఎంపికయ్యారు. 1996-96 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు. ఇక కమిషన్ సభ్యుల బ్యాక్ రౌండ్ విషయంలోనూ అలాంటి వివాదానికి తావు ఇవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారిని నియమించింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న కమిషన్ ను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంలో ప్రభుత్వం చొరవ కీలకం అయింది.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet