iDreamPost
android-app
ios-app

ఆస్కార్ కు మరింత చేరువలో జూనియర్ ఎన్టీఆర్!

  • Published Jan 21, 2023 | 8:01 PM Updated Updated Jan 21, 2023 | 8:01 PM
  • Published Jan 21, 2023 | 8:01 PMUpdated Jan 21, 2023 | 8:01 PM
ఆస్కార్ కు మరింత చేరువలో జూనియర్ ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంది. ఈ ఎపిక్ ఫిల్మ్ ఆస్కార్ బరిలో సైతం నిలిచి సత్తా చాటుతుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్, బెస్ట్ డైరెక్టర్ వంటి విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకునే అవకాశముందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని హాలీవుడ్ మీడియా సంస్థలు మాత్రం బెస్ట్ యాక్టర్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అవుతాడు అంటూ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడు. ఆర్ఆర్ఆర్ లో కూడా కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో ఉన్న అమాయకత్వాన్ని, ఆవేశాన్ని, బాధని చక్కగా పలికించాడు. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో అతని నటన అందరినీ ఆకట్టుకుంది. అందుకేనేమో కొన్ని హాలీవుడ్ మీడియా సంస్థలు ఎన్టీఆర్ కి ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉంది అంటున్నాయి.

ఇప్పటికే వెరైటీ మ్యాగజైన్ అంచనా వేసిన బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్ లిస్టులో ఎన్టీఆర్ పేరున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా యూఎస్ఏ కూడా ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచే అర్హత గల ఉత్తమ నటులు అంటూ టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది. అందులో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. అయితే ఈ లిస్టులో హాలీవుడ్ స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి ఎన్టీఆర్ పేరు మొదటి స్థానంలో ఉండటం సంచలనంగా మారింది. హాలీవుడ్ మీడియా అంచనా వేస్తున్నట్లు నిజంగానే ఎన్టీఆర్ పేరు ఆస్కార్ నామినేషన్స్ లో ఉంటే మాత్రం ఆ ఘనత సాధించిన మొదటి ఇండియన్ నటుడిగా సంచలనం సృష్టిస్తాడు. మరి ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు ఉందా లేదా అనేది జనవరి 24న అధికారికంగా తేలిపోనుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet