iDreamPost
android-app
ios-app

2023లో ప్రభాస్, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబుల బాక్సాఫీస్ క్లాష్ తప్ప‌దా?

  • Published Jul 11, 2022 | 5:00 PM Updated Updated Jul 11, 2022 | 5:00 PM
2023లో ప్రభాస్, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబుల బాక్సాఫీస్ క్లాష్ తప్ప‌దా?

ప‌వ‌న్ , అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు తెలుగులో టాప్ స్టార్స్. వీళ్ల మూవీస్ కి డేట్స్ దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది. కాని, ప్రభాస్, రామ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా కూడా పాన్-ఇండియా స్టార్లుగా ఎదిగారు. వాళ్ల సినిమాల కోసం హిందీ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలెక్క‌న రిలీజ్ డేట్ గురించి గ‌ట్టిగా ట్రైచేయాల్సిందే. మ‌రి ఈ స్టార్స్ డేట్స్ క్లాష్ అయితే, అదీ ఒకే నెల‌లో స్టార్ల సినిమాలు రిలీజ్ అయితే, మూవీ కలెక్షన్‌లు త‌గ్గిపోవ‌చ్చు. ఈయేడాది ఎలాంటి రిలీజ్ లు లేని ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు తమ సినిమాల రిలీజ్ కోసం మంచి డేట్ ను చూస్తున్నారు. థియేట‌ర్ల‌కి ఫ్యామిలీస్ రావాలి. అందుకే సెల‌వుల రోజును చూస్తున్నారు.

ఇలాంటి సినిమాల‌కు కనీసం వారం రోజులు ఎల‌క్ష‌న్స్ కుమ్మేయాలి. ఈలెక్క‌న సంక్రాంతి క‌న్నా, 30 మార్చి 2023 సినిమాల రిలీజ్ కు మంచి డేట్. మార్చి 30, గురువారం, రామ నవమి ఉంది, మ‌రో సెల‌వు వాటితోపాటు, ఏప్రిల్ 5 (బాబు జగ్జీవన్ జయంతి) ఏప్రిల్ 7 (గుడ్ ఫ్రైడే). అంటే ప‌దిరోజుల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ కు ఢోకా ఉండ‌దు.

ఈ సంగ‌తి తెలుసు కాబ‌ట్టే, ప్రభాస్ సాలార్, రామ్ చరణ్ RC 15, Jr NTR కొర‌టాల శివ సినిమాయేకాదు, మహేష్ బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లోని SSMB28, అన్నీ మార్చి 30న విడుదల చేయాలని ట్రై చేస్తున్నాయి. ఎవ‌రు ముందు డేట్ ఫిక్స్ చేసుకొంటే వాళ్ల‌కి జాక్ పాక్ దొరికిన‌ట్లే. మొత్తం నాలుగు సినిమాల అఫిషియ‌ల్ డేట్స్ ఇంకా తెలియ‌దు. ఐతే, సాలార్, శంక‌ర్ డైరెక్ష‌న్ లోని RC 15 ఇప్పటికే షూటింగ్స్ లో ఉన్నాయి. SSMB28కి త్వరలో త్రివిక్ర‌మ్ రోలింగ్ చెప్ప‌నున్నారు. ఎన్టీఆర్ 30 సినిమా ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

వీళ్లంద‌రిలో నాలుగు సినిమాలు లైన్లో ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. సాలార్‌తో పాటు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉన్న‌ ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలతోపాటు, స్క్రిప్ట్ న‌చ్చితే మారుతి సినిమాలోనూ న‌టిస్తాడు. స్పిరిట్ 2024లోనే రిలీజ్ కావ‌చ్చు. ల‌క్ కుదిరితే మారుతి సినిమాకు ఆరునెల‌లు చాలు. కానీ, ఆదిపురుష్, సాలార్ , ప్రాజెక్ట్ K 2023లో విడుదల కానున్నాయి. ఆదిపురుష్ ఇండియాలోని అన్ని ప్ర‌ముఖ భాష‌ల్లోనూ, ఇంగ్లీష్ లోనూ రిలీజ్ కానుంది. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు, సాలార్‌లో శ్రుతి హాసన్ హీరోయిన్. ప్రాజెక్ట్ K లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లు ఉన్నారు. మొత్తం మీద ఈ బాక్సాఫీస్ రేసులో ప్ర‌భాస్ కే ఎడ్వాంటేజ్.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş