iDreamPost
android-app
ios-app

జూ. ఎన్టీఆర్ కి ఆస్కార్ అకాడమీ బిగ్ సర్ప్రైజ్! ఆ లిస్ట్ లో పేరు..

  • Author ajaykrishna Updated - 09:03 AM, Thu - 19 October 23
  • Author ajaykrishna Updated - 09:03 AM, Thu - 19 October 23
జూ. ఎన్టీఆర్ కి ఆస్కార్ అకాడమీ బిగ్ సర్ప్రైజ్! ఆ లిస్ట్ లో పేరు..

RRR.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్. గతేడాది వరల్డ్ వైడ్ విడుదలై బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేసిందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సైతం కొల్లగొట్టింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయికి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఆర్ఆర్ఆర్. సొంత దేశంలోనే కాదు.. విదేశాలలో కూడా ఆడియన్స్ తో పాటు ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని మెప్పించింది ఆర్ఆర్ఆర్.

కట్ చేస్తే.. ఈ సినిమాతో ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు. పైగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కి అత్యున్నత పురస్కారం ఆస్కార్ వరించడం మరో విశేషం. ఆస్కార్ రాకతో అసలు తెలుగు సినిమా మేకింగ్ కూడా మరో స్థాయికి చేరుకుంది. అయితే.. తాజాగా ఆస్కార్ అకాడమీ ఎన్టీఆర్ కి, టాలీవుడ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ ని యాడ్ చేస్తున్నట్లు పోస్ట్ ద్వారా సర్ప్రైజ్ చేశారు. కొత్త మెంబర్స్ గా యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ ని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ మెంబర్స్ లిస్ట్ లో చేరడంతో అటు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సైతం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ప్రెజెంట్ దర్శకుడు కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో దేవర మొదటి భాగం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమానే కాకుండా ఎన్టీఆర్ అటు బాలీవుడ్ లో వార్ 2, ఇటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా లైనప్ చేసిన విషయం విదితమే. మొత్తానికి ఎన్టీఆర్ వచ్చే ఏడాది నుండి ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఎన్టీఆర్ ఆస్కార్ అకాడమీ మెంబర్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet