iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద.. తెల్లవారుజామునే నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

  • Published May 28, 2022 | 7:43 AM Updated Updated May 28, 2022 | 7:43 AM
  • Published May 28, 2022 | 7:43 AMUpdated May 28, 2022 | 7:43 AM
ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద.. తెల్లవారుజామునే నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

తెలుగు వారి మహనీయుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28. ఈ రోజు ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ అభిమానాలు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ ని సర్వాంగ సుదరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు క్యూ కట్టారు. శనివారం తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు చేరుకొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్ద ఈ ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఘాట్ కి విచ్చేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ శత జయంతి కావడంతో ఉదయం నుంచే ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique