ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రెండు రోజులు మాత్రమే గడువు

భారతీయ నౌకా దళంలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుండి దరఖాస్తులు కోరుతోంది ఇండియన్ నేవీ. సుమారు లక్ష వరకు వేతనం అందుతుంది. దీనికి కేవలం రెండు రోజుల మాత్రమే గడువు ఉంది.

భారతీయ నౌకా దళంలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుండి దరఖాస్తులు కోరుతోంది ఇండియన్ నేవీ. సుమారు లక్ష వరకు వేతనం అందుతుంది. దీనికి కేవలం రెండు రోజుల మాత్రమే గడువు ఉంది.

దేశానికి సేవ చేయాలనుకోవడంతో పాటు కుటుంబానికి ఆర్థిక చేయూతనందించగలిగే ఉద్యోగాల్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు మంచి ఛాయిస్. అందుకే ఆశావాహులు వీటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి అభ్యర్ధుల కోసం సరికొత్త నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ నౌకా దళంలో పరిమిత కాలానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుండి దరఖాస్తులు కోరుతోంది ఇండియన్ నేవీ. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. జనరల్ సర్వీస్, ఏటీసీ, పైలట్, లాజిస్టిక్, తదిరత విభాగాల్లో ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇంజనీరింగ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు 60 శాతం మార్కులు తప్పని సరి. ఇక జీతానికి వస్తే.. నెలకు రూ. 56, 100. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సహాకాలతో కలిపి సుమారు లక్ష వరకు వేతనం అందుతుంది. ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. వచ్చిన దరఖాస్తుల్లో .. అకడమిక్ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. వచ్చిన దరఖాస్తులను బట్టి.. ఒక్కో పోస్టుకు కొంత మందిని చొప్పున సెలక్ట్ చేసి, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ మార్కులు పొందిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. ఎంపికలో ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఏడాది ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో విజేతలైన వారికి నేవల్ అకాడమీ, ఎజిమాళలో వచ్చే నెల జూన్ నుండి 44 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ప్రొబేషన్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. వీరు పదేళ్లు విధుల్లో ఉంటారు. అనంతరం పనితీరు, సంస్థ అవసరాల కోసం మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉద్యోగాల నుండి వైదొలగాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు చివరి తేదీ 29. అంటే ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక పోస్టుల వివరాల్లోకి వెళితే..

ఎడ్యుకేషన్ బ్రాంచ్ : 18 ఖాళీలున్నాయి. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులు తప్పని సరి.
టెక్నికల్ బ్రాంచ్: ఇంజనీరింగ్ విభాగంలో 30, ఎలక్ట్రికల్ విభాగంలో 50, నేవల్ కన్‌స్ట్రక్టర్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి.. బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులు ఉన్న వారు అర్హులు.
వయస్సు, వయో పరిమితి : 1990-200 జులై 2 నుండి 2003-2005 జులై 1 మధ్య జన్మించాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 29.
వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in/

Show comments