iDreamPost
android-app
ios-app

అందాలా నటుడిగా సైకో విలన్

  • Published Feb 17, 2020 | 6:58 AM Updated Updated Feb 17, 2020 | 6:58 AM
  • Published Feb 17, 2020 | 6:58 AMUpdated Feb 17, 2020 | 6:58 AM
అందాలా నటుడిగా సైకో విలన్

గత నెల విడుదలైన అశ్వద్ధామ అంచనాలు అందుకోలేకపోయినా అందులో సైకో విలన్ గా నటించిన జిస్సు సేన్ గుప్తాకు మంచి పేరు వచ్చింది. చేసింది ప్రతినాయక పాత్రే అయినప్పటికీ ఇతగాడిది మంచి రూపం. బెంగాలీకి హీరోగా కూడా జిస్సు బాగా పాపులర్. ఇతర భాషల్లో సపోర్టింగ్ రోల్స్ రావడంతో ఇలా అన్ని చేసుకుంటూ పోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ జిస్సు సేన్ గుప్తా త్వరలో సౌత్ స్క్రీన్ మీద అలనాటి అందాల నటుడు శోభన్ బాబు పాత్రలో కనిపించబోతున్నట్టు తాజా అప్ డేట్.

కోలీవుడ్ ఫేమ్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్వర్గీయ జయలలిత బయోపిక్ తలైవిలో జిస్సు సేన్ కు శోభన్ బాబు పాత్ర ఆఫర్ చేసినట్టు తెలిసింది. అధికారిక ధృవీకరణ రానప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని వినికిడి. టైటిల్ రోల్ లో కంగనా రౌనత్ పోషిస్తుండగా ఇప్పటికే లుక్ పరంగా మిశ్రమ స్పందన లభించింది. ఎంజిఆర్ గా అరవింద స్వామికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. శోభన్ బాబు లాంటి పాత్రకు జిస్సు సేన్ గుప్తా మంచి ఛాయస్ అని చెప్పొచ్చు. 

జయలలిత జీవితంలో శోభన్ బాబు పాత్ర గురించి అప్పట్లో చాలా కథనాలు వచ్చేవి. ఇప్పటికీ  దాని గురించి స్పష్టమైన సమాచారం ఎవరు చెప్పలేరు. ఇటీవలే విడుదలైన క్వీన్ వెబ్ సిరీస్ లోనూ ఈ ప్రస్తావన రాకుండా వేరే పాత్రను సృష్టించి మేనేజ్ చేశారు కానీ ఆ ట్రాక్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. మిగిలిన సిరీస్ మొత్తం ఆసక్తికరంగా ఉండటంతో పాటు రమ్యకృష్ణ క్వీన్ నటించడం దాన్ని హిట్ చేశాయి. ఇప్పుడు తలైవి దాన్ని మించి ఉంటేనే ప్రేక్షకుల నుంచి మెప్పు పొందుతుంది. ప్రకాష్ రాజ్ కరుణానిధి పాత్రలో నటిస్తున్న తలైవి అన్ని ప్రధాన భాషల్లో ఈ ఏడాదే విడుదల కానుంది. తేదీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom