iDreamPost
iDreamPost
Jio ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికే రోజుకు 2.5 GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS యేడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్టాన్ ఒక్కసారి తీసుకొంటే 365 రోజులపాటు బిందాస్.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా టెలికాం కంపెనీలు వరుసగా ఆఫర్లను ఇస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ ఒక్కసారి ప్లాన్ తీసుకొంటే 300రోజుల పాటు వాడుకొనే ఆఫర్ నిస్తే, రిలయన్స్ మరింత ముందుకెళ్లింది. రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌లను ప్రకటించింది. ప్లాన్‌లతోపాటు హాట్ స్టార్, ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో ప్రకారం, రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.3,000 విలువైన అదనపు ప్రయోజనాలు అందుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకొంటే రోజుకు 2.5GB హై-స్పీడ్ 4G డేటా, 365 రోజుల వ్యాలిడిటీతోపాటు, సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఫ్రీ.
Celebrate freedom with Jio's ₹2999 Independence offer and enjoy free benefits worth ₹3000 🤩
Recharge now: https://t.co/vBXlf7ckat#JioDigitalLife #WithLoveFromJio pic.twitter.com/xH8n5FG5DO
— Reliance Jio (@reliancejio) August 9, 2022
రిలయన్స్ తన వ్యాపార సామ్రజ్యంలోకి కంపెనీలతోపాటు, ఇతర కంపెనీల ఆఫర్లను జీయో ప్లాన్ పరిధిలోకి తీసుకొచ్చింది. Jio ఇండిపెండెన్స్ ఆఫర్ కింద, Ajioపై రూ. 750 తగ్గింపు, netmeds.comపై రూ. 750 తగ్గింపు, ixigoపై రూ. 750 తగ్గింపు, రూ. 750 విలువైన 75GB అదనపు డేటాను వాడుకోవచ్చు. వీటన్నింటిని లెక్కగడితే ఈ ప్రత్యేక ఆఫర్ విలువు రూ 3,000.
JioGamesWatch brings you the best gaming content live in high quality. Watch & engage with your favourite content creators live on JioGamesWatch.
Navigate to JioGamesWatch section in JioGames app's bottom right corner.Download:https://t.co/uE4xWrTC1Z#JioGamesWatch #JioGames pic.twitter.com/A9u1KU7mKW
— JioGames (@jiogames) August 6, 2022
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం జియో గేమ్‌ల యాప్‌లో జియోగేమ్స్‌వాచ్( JioGamesWatch) కొత్త గేమింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ Jio డివైస్ బటన్‌ను క్లిక్ చేస్తే చాలు, immersive, interactive game streamingను ఆస్వాదించగలరని భరోసానిస్తోంది.
JioGamesWatch కొన్ని ముఖ్య ఫీచర్లు క్రాస్-ప్లాట్‌ఫారమ్ ల్లో వాడొచ్చు. అంటే హోమ్ స్క్రీన్‌లోని Jio సెట్-టాప్-బాక్స్ (STB) తోపాటు, స్మార్ట్‌ఫోన్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.