iDreamPost
iDreamPost
పొడిచిన నేరస్తుడిది కాదు కత్తి అమ్మిన షాప్ వాడిది నేరం అంటున్న జేసీ దివాకర్ తనయుడు పవన్ రెడ్డి
154 వాహనాలకు నకిలీ ఎన్ఓసీలు సమర్పించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి , తనయుడు అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ లోని వారి నివాసంలో అరెస్ట్ చేసి తాడిపత్రి తరలిస్తున్నారని సమాచారం .
వాహనాలను బిఎస్-3 నుండి బిఎస్-4 గా మార్చడం , వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని , పాత వాహనాలని కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయడం వంటి పలు అభియోగాల పై అనంతపురం , తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో ఈ వాహనాల పై ఇప్పటికి 27 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది .
ఆది నుండీ వివాదాలకు అక్రమ రిజిస్ట్రేషన్ , పెర్మిట్లు లేకుండా బస్సులు తిప్పటం పై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసి ట్రావెల్స్ గతంలో కాంగ్రెస్ హయాంలో బస్సు తగలబడి 40 మందికి పైగా సజీవదహనం కాగా , 2017 లో కృష్ణా జిల్లాలో కల్వర్ట్ వద్ద బోల్తా పడి 11 మంది దుర్మరణం చెందారు .కనీసం కేసు కూడా నమోదు చేయకుండా మృత దేహాలు ప్యాక్ చేయటానికి సిద్ధపడగా వైసీపీ అడ్డుపడటం జరిగింది .
Also Read:జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్
అంతే కాక పలు సందర్భాల్లో ట్రావెల్ యాజమాన్యం , సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించినట్లు పలు ఆరోపణలు ఉండగా , ఒక ఘటనలో జేసి ట్రావెల్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలి పట్ల దురుసుగా వ్యవహరించి దుర్భాషలాడటంతో పాటు చేయి చేసుకోగా సూర్యాపేట మిగతా ప్రయాణికులు , పోలీసులు సదరు డ్రైవర్ చేత మహిళా ప్రయాణికురాలి కాళ్ళు పట్టించడం గమనార్హం .
కాగా ఈ అరెస్టుల పై జేసి దివాకర్ రెడ్డి తనయుడు జేసి పవన్ రెడ్డి స్పందిస్తూ తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీ తమని మోసం చేసిందని ఆ కంపెనీ పై చర్య తీసుకోకుండా తమ పై చర్య తీసుకోవడం అనారోగ్యంతో ఉన్న బాబాయ్ ని అరెస్ట్ చేయడం అన్యాయమని విచిత్ర వాదన తెర పైకి తీసుకొచ్చారు . అయితే అశోక్ లేలాండ్ కంపెనీ పాత వాహనలు అమ్మిందా , ఇన్సూరెన్స్ ల చెల్లింపులతో అశోక్ లేలాండ్ కంపెనీకి సంభందం ఏమిటీ , పెర్మిట్స్ లేకుండా వాహనాలు తిప్పటంలో అశోక్ లేలాండ్ పాత్ర ఎందుకుంటుంది , నకిలీ ఎన్వోసీలు కూడా అశోక్ లేలాండ్ కంపెనీనే ఇచ్చిందా , వీటిలో కంపెనీ ప్రమేయం ఉండదు కదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు .
Also Read:అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?
ఏదేమైనా మత్తు డాక్టర్ అరెస్ట్ విషయంలో ఎస్సి , అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో బీసీ కులం కార్డ్ వాడిన టీడీపీ నాయకులకు , జేసీ కుటుంబ సభ్యుల విషయంలో ఆ చాన్స్ లేకపోవడంతో నెపాన్ని వెహికల్ అమ్మటం తప్ప మరే సంభందం లేని అశోక్ లేలాండ్ కంపెనీ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు ఉందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం .