sai
sai
నివర్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పది వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్‌తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం దీక్ష చేస్తున్నారు. తన నివాసంలో ఈ రోజు ఉదయం పది గంటలకు పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.
రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో 175 నియోజకవర్గాల్లోనూ జనసేన కార్యకర్తలు దీక్షలు చేయాలని పవన్ పిలుపునిచ్చారు. పవన్‌తోపాటు జనసేన కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దీక్షలు చేస్తున్నారు.
కాగా, నివర్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. పంట నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి వివరాలు సేకరించాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. డిసెంబర్ 31 నాటికి పరిహారం చెల్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలోనూ తీర్మానం చేసింది.