iDreamPost
iDreamPost
ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికిగాను, 11.02 లక్షల మంది విద్యార్ధులకు, రూ. 694 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం బాపట్లలో బటన్ నొక్కి, నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 11,715 కోట్లు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించవచ్చు.
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్నలక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని త్రైమాసికం ముగిసిన వెంటనే, విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వ జమ చేస్తోంది.
పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా, ఏటా సార్లు ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల విద్యార్ధులకు రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్నారు.