Idream media
Idream media
సీబీఐ ప్రత్యేక కోర్టులో సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈడీ కేసులో కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ప్రత్యేక న్యాయ స్థానం తోసిపుచ్చింది. ఈ రోజు వైఎస్ జగన్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు పై విధంగా స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.