Krishna Kowshik
పనుల మీద లేదా ఇంటికి త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాలను రయ్ మంటూ రోడ్లపై దూసుకెళుతుంటారు. ఇక నడక దారిన వెళ్లే వాళ్లు కూడా వాహనాలను పట్టించుకోకుండా వెళుతుంటారు. ఇదే ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
పనుల మీద లేదా ఇంటికి త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాలను రయ్ మంటూ రోడ్లపై దూసుకెళుతుంటారు. ఇక నడక దారిన వెళ్లే వాళ్లు కూడా వాహనాలను పట్టించుకోకుండా వెళుతుంటారు. ఇదే ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
Krishna Kowshik
దేశంలో జనాభా వృద్ధి చెందడంతో వాహనాల వినియోగం పెరిగి.. తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఇంట్లో బయలు దేరామంటే స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు నరకయాతన చూస్తున్నారు. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతో ఇష్టాను సారం వాహనాలు నడుపుతూ.. వారి జీవితాలను ప్రమాదంలో పెడుతూ.. ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. వీటికి తోడు రోడ్లపై సంచరిస్తున్న జంతువుల కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మన దారిలో మనం పోతున్నా.. సడెన్‌గా కుక్క, గేదెలు, ఆవులు వంటి జీవాలు అడ్డు పడుతుంటాయి. ఈ ఊహించని పరిణామాలను వాహనదారులు కూడా తమ వాహనాలపై నియంత్రణ కోల్పోవడంతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇదే తరహా ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం.. చక్కని కుటుంబం.. బంగారం లాంటి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఓ జంతువు వారి కుటుంబంలో విషాదం నింపింది. ఇంతకు ఆ జంతువు ఏంటంటే.. పంది. విన్నది నిజమే.. వినడానికి ఫన్నీగా అనిపించినా.. ఆ కుటుంబంలో ఓ మనిషిని కోల్పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పద్మావతి (40) కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. బుధవారం కూడా యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.
తన తోటి ఉపాధ్యాయులు జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మి మానస, సయబాసుల్తానా కలిసి ఆటోలో వెళుతున్నారు. మహబూబ్ నగర్ వెళుతుండగా.. పారుపల్లి స్టేజీ వద్ద ఒక్కసారిగా పంది అడ్డువచ్చింది. దీన్ని ఆటో డ్రైవర్ గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా.. మిగిలిన టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి.. చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు పద్మావతి మరణ వార్త చేరే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు.