ఇష్క్ మూవీ రిపోర్ట్

నిన్న విడుదలైన సినిమాల్లో తిమ్మరుసు తర్వాత జనంలో అంతో ఇంతో ఆసక్తి రేపిన మూవీ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. లాక్ డౌన్ కు ముందే విడుదల కావాల్సినప్పటికీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ థ్రిల్లర్ కం రివెంజ్ డ్రామా కాస్త గట్టిగానే ప్రమోషన్ చేసుకుంది. భారీ చిత్రాల పోటీ లేకపోవడంతో ఓపెనింగ్స్ తో పాటు కాస్త లాంగ్ రన్ కూడా దక్కుతుందనే నమ్మకంతో ఉన్న టీమ్ ఆశలను ఇష్క్ నిలబెట్టిందా లేదా సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం. ఎలాంటి రిస్క్ లేకుండా ఈజీగా తీసేసి లాభాలు చేసుకోవచ్చనే భ్రమలో వచ్చిన మరో మలయాళ రీమేక్ ఇది. అక్కడి ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకోవడంతో ఇక్కడా అదే రిపీట్ అవుతుందనుకున్నారు

Also Read: తిమ్మరుసు రివ్యూ

సింపుల్ గా చెప్పాలంటే ఒక రాత్రి మొదలయ్యే కథ ఇది. డీప్ గా లవ్ చేసుకున్న ఒక ప్రేమ జంట రాత్రి షికారుకు వెళ్తారు. ఓ పోలీస్ కంట పడతారు. వాడేమో తన శాడిజం మొత్తం చూపించి వీళ్ళను వదిలిపెడతాడు. దీనికి ప్రతీకారంగా ఆ ప్రియుడు ఆ ఆఫీసర్ కు ఎలా బుద్ది చెప్పాడనేదే మెయిన్ పాయింట్. లైన్ కొంచెం ఆసక్తికరంగా ఉన్నా తెలుగు ప్రేక్షకుల అభిరుచులు అంచనాలకు తగ్గట్టు అవసరమైన మార్పులు చేర్పులు చేయకపోవడంతో ఇష్క్ కాస్తా సహనానికి పెద్ద పరీక్షలా మారిపోయింది. ఒక్కో సన్నివేశం పావు గంట సేపు సాగదీస్తూ నడిపితే ఇదేమైనా పబ్లిక్ ఎగ్జామా లేని ఓపికను తెచ్చుకోవడానికి. దీని విషయంలో జరిగిందదే.

Also Read: సినిమా హాళ్లకు శుభారంభం దక్కిందా

చాలా తక్కువ బడ్జెట్ లో ఇంకా చెప్పాలంటే ఒక ఇండిపెండెంట్ మూవీ కోసం ఖర్చు పెట్టే మొత్తంలో దీన్ని చుట్టేశారు. రెండు గంటల నిడివి సైతం ఎక్కువగా ఫీలవ్వాల్సి వచ్చిందంటే దానికి కారణం విపరీతమైన స్క్రీన్ ప్లే ల్యాగ్. . మహతి స్వర సాగర్ సంగీతం పర్వాలేదనిపించుకుంది. ఎస్ఎస్ రాజు దర్శకత్వం పూర్తిగా తేలిపోయింది. ఓటిటిలో చూడటమే ఎక్కువ అనుకునే ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేసేవి కాదు. కేరళవాసులకు తెలుగు మూవీ లవర్స్ కు ఆలోచనల్లో చాలా వ్యత్యాసం ఉందని మన దర్శక నిర్మాతలు గుర్తించనంత వరకు ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. హక్కులు కొన్నంత ఈజీ కాదు హిట్లు కొట్టడం

Show comments