iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేసింది!

  • Published Jul 08, 2024 | 5:20 PM Updated Updated Jul 08, 2024 | 5:20 PM

మామూలుగా సినిమా కంప్లీట్ అయ్యి.. రిలీజ్ అయ్యాక హీరోయిన్లు ఫేమస్ అవుతుంటారు. ఈ ఫోటోలోని చిన్నారి స్టైలే వేరు. నటిగా అడుగుపెడుతూ.. ఒక్క ట్రైలర్ తో కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో తెలుసా..?

మామూలుగా సినిమా కంప్లీట్ అయ్యి.. రిలీజ్ అయ్యాక హీరోయిన్లు ఫేమస్ అవుతుంటారు. ఈ ఫోటోలోని చిన్నారి స్టైలే వేరు. నటిగా అడుగుపెడుతూ.. ఒక్క ట్రైలర్ తో కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో తెలుసా..?

  • Published Jul 08, 2024 | 5:20 PMUpdated Jul 08, 2024 | 5:20 PM
ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేసింది!

సాధారణంగా ఓ హీరోయిన్ క్లిక్ అవ్వాలంటే.. సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది. సినిమా హిట్టయితే గోల్టెన్ లెగ్ అన్న ముద్ర పడుతుంది. ఆ తర్వాత ఆఫర్లు క్యూ కడతాయి. తాను ఊహించలేనంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. బిగ్ హీరోస్ అండ్ డైరెక్టర్ల మూవీలో ఛాన్సులు వస్తుంటాయి. ఆమె క్లిక్ అయ్యి, మూవీ ప్లాపైతే.. ఫేట్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డిసైడ్ చేస్తుంది. ఆఫర్లు రావొచ్చు, రాకనూ పోవచ్చు. వస్తే చిన్న చిన్న సినిమాలు, లేదా సెకండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్.. ఇక హీరోయిన్ హోప్స్ లేకుండా వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లడమే. ఇక్కడ టాలెంట్‌తో పాటు అదృష్టం కలిసి ఉండాలి అంటుంటారు. అయితే అదృష్టం వరించినా.. టాలెంట్ ఉంటేనే ఆఫర్లు వస్తుంటాయని మరికొంత మంది వాదన.

ఏదేమైనా ఈ అమ్మాయి విషయంలో అదృష్టం, టాలెంట్ ఉన్నా..స్టార్ ఇమేజ్‌కు ఆమడ దూరంలో ఆగిపోయింది. సినిమా రిలీజ్ కాకుండానే ట్రైలర్‌తోనే పిచ్చెక్కించింది. ఏకంగా మెయిన్ హీరోయిన్ ప్లేసును కబ్జా చేసింది. కుర్రాళ్లైతే ఆమె కళ్లకు పడిపోయారు. అయితే ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు కానీ..టాప్ హీరోయిన్ కాలేకపోయింది. ఈమె కూడా మాలీవుడ్ కుట్టీనే. మలయాళం, తెలుగు, హిందీ అంటూ పరగులు పెడుతోంది. బుగ్గకింద చేయి పెట్టి ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి.. కన్నుగీటి ఒక్క రాత్రికే కుర్రాళ్ల క్రష్ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు అదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే)తో కట్టిపడేసిన కళ్లు ట్వింకిల్ చేసి పడేసింది ప్రియా. ఈ మూవీ ట్రయలర్ వచ్చినప్పుడు.. ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, ప్రియా క్యారెక్టర్ మారిపోయినట్లు మరో హీరోయిన్ నూరిన్ షెరీఫ్ గతంలో వాపోయింది.

తనను దర్శకుడు హైలెట్ చేశాడని చెప్పుకుంది. మలయాళంలో ఓకే అనిపించినా.. తెలుగులో అంత ఆకట్టుకోలేదు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చెక్ మూవీలో యాక్ట్ చేసింది ప్రియా . హనుమాన్ హీరో తేజ సజ్జాతో ఇష్క్ చేసింది. మళ్లీ మలయాళంలో ఓ మూడు సినిమాలు చేసింది. రెండేళ్లు గ్యాప్ తీసుకుని తెలుగులో సాయి ధరమ్ తేజ్ చెల్లెలిగా నటించింది. అటు హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కన్నుగీటి అదృష్టాన్ని కొల్లగొట్టిన ప్రియా.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో మూడు ప్రాజెక్టులు చేస్తోంది. త్రీమంకీస్, లవ్ హాకర్స్, విష్ణు ప్రియ వంటి సినిమాలు చేయబోతుంది. మళ్లీ ఎప్పుడు తెలుులో అలరిస్తుందో చూడాలి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet