iDreamPost
android-app
ios-app

Khiladi : రవితేజ సినిమాల ఆర్డర్ మారుతోందా

  • Published Dec 09, 2021 | 10:16 AM Updated Updated Dec 09, 2021 | 10:16 AM
  • Published Dec 09, 2021 | 10:16 AMUpdated Dec 09, 2021 | 10:16 AM
Khiladi :  రవితేజ సినిమాల ఆర్డర్ మారుతోందా

మాస్ మహారాజా ఖిలాడీ రిలీజ్ డేట్ 2022 ఫిబ్రవరి 11 అని నెల క్రితమే ప్రకటించారు. అడవి శేష్ మేజర్ తో పాటు వారం ముందు చిరంజీవి ఆచార్య ఉన్నప్పటికీ ఇలా అనౌన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఖిలాడీ చెప్పిన టైంకి వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయట. ఇంకా కొంత భాగం పెండింగ్ ఉండటంతో పాటు అది కూడా విదేశాల్లోనే తీయాల్సిన కారణంగా మళ్ళీ బ్రేక్ పడినట్టు చెబుతున్నారు. ఇక్కడే సెట్స్ లేదా గ్రీన్ మ్యాట్ వేసి తీసే అవకాశం లేని విధంగా లొకేషన్లు అవసరం పడటంతో దాని బదులు రామారావు ఆన్ డ్యూటీని త్వరగా వచ్చేలా మార్చ్ 22ని లాక్ చేసినట్టుగా ఫిలిం నగర్ న్యూస్.

ఇందులో నిజమెంతుందో నిర్మాతలే చెప్పాలి. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఖిలాడీ మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా ఉండటం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రెండు షేడ్స్ లో రవితేజ పెర్ఫార్మన్స్ లాంటి అంశాలు దీని మీద హైప్ ని పెంచేశాయి. కానీ ఇప్పుడు అసలు చెప్పిన టైంకి ఖిలాడీ రాకపోవచ్చనే వార్త అభిమానులకు టెన్షన్ పుట్టించేదే. అఫీషియల్ గా మరోసారి మేకర్స్ క్లారిటీ ఇస్తే వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు రాక్షసుడు రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడీ పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు.

రవితేజ ఈ ఏడాది నుంచి మంచి దూకుడు మీదున్నారు. రామారావు తో పాటు మరోవైపు ధమాకా షూటింగ్ వేగంగా చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ని కూడా వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లానింగ్ జరుగుతోంది. పోటీగా ఇదే కథతో సాయి శ్రీనివాస్ కూడా స్టువర్ట్ పురం దొంగ చేస్తుండటంతో ఆలస్యం జరగకుండా చేయమని ఆల్రెడీ టీమ్ కు చెప్పినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే రవితేజ రెస్ట్ లేకుండా కాల్ షీట్స్ ని బిజీగా ఉంచుతున్నారని అర్థమవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన రావణాసుర లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెగ్యులర్ షూట్ నే 2023లో స్టార్ట్ చేయొచ్చు. మధ్యలో మెగాస్టార్ 154 కూడా ఉంది.

Also Read : 1945 : రానా సినిమా కూడా ఆర్ఆర్ఆర్ లైన్ లోనే

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet