iDreamPost
iDreamPost
ఈ ఏడాది నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని అల వైకుంఠపురములో రూపంలో అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ కూడా జోరుగా ప్రచారం జరిగింది. దీని తాలుకు అఫీషియల్ అప్ డేట్ తారక్ పుట్టినరోజు మే 20న వస్తుందని అభిమానులు ఎదురు చూశారు కాని ఓ పాత స్టిల్ ని షేర్ చేయడం తప్ప ఇంకే సమాచారం లేదు. ఈలోగా త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్-నానిల కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనే కొత్త ప్రచారం మొదలయ్యింది.
దీనికి కారణం లేకపోలేదు. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో 2021 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇంకో ఆరు నెలలు వాయిదా పడేలా ఉంది. రాజమౌళి సహా యూనిట్ ఎవరూ దీన్ని ధృవీకరించపోయినప్పటికీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేని మాట వాస్తవం. ఆ పండగ స్లాట్ లో చిరంజీవి ఆచార్య రావోచ్చనే న్యూస్ కూడా గట్టిగానే వినిపించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడి షూటింగ్ ఆలస్యమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో అందుబాటులోకి రాడు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అయితే సిద్ధం చేశాడు కాని అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకని వెంకీ సినిమాని ప్లాన్ చేసినట్టుగా ఫిలిం నగర్ టాక్. అయితే ఇప్పుడు ఏదీ నమ్మడానికి లేదు. వెంకీ ఇంకా నారప్ప బాలన్స్ పూర్తి చేయాల్సి ఉంది.
మరోవైపు అనిల్ రావిపూడి ఎఫ్3 కోసం వేచి చూస్తున్నాడు. సో అంత ఈజీగా ఇది పట్టాలు ఎక్కుతుందన్న నమ్మకం లేదు. మరోవైపు త్రివిక్రం ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా తారక్ తో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమానే హాట్ టాపిక్ గా మారింది. వీటి సంగతి ఎలా ఉన్నా హీరో నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. త్రివిక్రమ్ సైతం సైలెంట్ గా ఉన్నాడు. షూటింగులు తిరిగి ప్రారంభించాక కొద్దిరోజులు ఆగి ఆపై ఏదో ఒక కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా జూనియర్ ఫ్యాన్స్ తో పాటు త్రివిక్రమ్ అభిమానులు కూడా వేచి చూడక తప్పదు.ఆర్ఆర్ఆర్ ఎప్పుడు పూర్తవుతుందనే మీద చాలా సినిమాల ఫ్యూచర్ ప్లానింగ్ ఆధారపడి ఉంది. రాజమౌళి అంటే అంతే. తన ప్రభావం ఇండస్ట్రీ మీద ఉండేలా సినిమాలు రూపొందుతాయి