iDreamPost
android-app
ios-app

మమ్ముట్టి కొడుకు కావడం, బంధుప్రీతి, స్టార్ కావడానికి హెల్ప్ అయ్యిందా? సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఏమ‌న్నారు?

  • Published Aug 06, 2022 | 3:24 PM Updated Updated Aug 06, 2022 | 3:25 PM
మమ్ముట్టి కొడుకు కావడం, బంధుప్రీతి, స్టార్ కావడానికి హెల్ప్ అయ్యిందా? సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఏమ‌న్నారు?

సూపర్‌స్టార్ కి కొడుకు కావడం వల్ల తన కెరీర్‌ని ఎలా టేకాఫ్ అయ్యిందో దుల్కర్ మ‌న‌సు విప్పాడు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ కలిసి నటించిన దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం సీతారామం హిట్ టాక్ మ‌ధ్య, మీడియాకు వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

మ‌హాన‌టితోనే టాలీవుడ్ కు ద‌గ్గ‌రైన‌ దుల్కర్, ఇప్పుడు టాలీవుడ్ హార్ట్ బీట్ అయిపోయాడు. సినిమా సినిమాకు అత‌ని రేంజ్ పెరుగిపోతోంది. దానికి తోడు సూప‌ర్ స్టార్ మమ్ముట్టి కుమారుడ‌న్న స్టేట‌స్ మ‌రొక‌టి. ఒక ఇంటర్వ్యూలో, మమ్ముట్టి కొడుకు కావడం అతని కెరీర్‌ను ప్రభావితం చేసిందా? బంధుప్రీతి వ‌ల్ల అత‌నికి హీరోగా సినిమాలు వ‌చ్చాయా అని అడిగారు.

సినిమాలు, వినోద రంగంలో బంధుప్రీతి(Nepotism) మీద గ‌ట్టి చ‌ర్చ‌జ‌రుగుతూనే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, వాళ్లు, వాళ్ల పిల్ల‌లు, ద‌గ్గ‌రివాళ్ల‌కే అవ‌కాశాలు వ‌స్తాయికాని, కొత్త‌వాళ్ల‌కు ఎక్కువ‌గా ఛాన్స్ లు దొర‌క‌వ‌న్న‌ది ఒక విమ‌ర్శ‌. అందుకే మీడియా దుల్క‌ర్ కు ఇదే ప్ర‌శ్న సంధించింది. మమ్ముట్టి దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సూప‌ర్ స్టార్స్ లో ఒక‌రు. అత్యంత గౌరవనీయమైన న‌టుడు. మమ్ముట్టి చాలా భాషల్లో చిత్రాల్లో నటించడమేకాదు, కొన్ని సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశారు. అందుకే ఇండియ‌న్ సినిమాకు చేసిన‌ కృషికి గుర్తుగా, పద్మభూషణ్ అందుకున్నారు. అలాంటి తండ్రి, సూప‌ర్ స్టార్ కావడంతో, దుల్కర్ సల్మాన్ కు ముమ్ముట్టి పేరు, పాపులారిటీ అతని కెరీర్‌లో ఏదైనా హెల్ప్ చేసిందా అని అడిగారు. సూప‌ర్ స్టార్ కొడుకుగానే ముందు త‌న‌కు గుర్తింపు, సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెప్పాడు దుల్క‌ర్. అయినా “నేను నా స్వంత గుర్తింపు కోసం పనిచేశాను” అని చెప్పాడు. తండ్రి ప‌క్క‌న ఉండ‌టం వ‌ల్ల, తాను చేయవలసినవి ఏంటి? చేయకూడనివి ఉంటో అన్నీ నేర్చుకున్నానని చెప్పాడు. ముమ్ముట్టి కొడుకుగా క‌న్నా, తన వ్యక్తిగత గుర్తింపు ఎప్పుడూ ముఖ్యమైనదిగా భావిస్తున్నానని చెప్పాడు.


అదే ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ కూడా పాన్ ఇండియా పై స్పందించారు. పాన్-ఇండియా అనే పదం గురించి దుల్కర్‌కు సొంత అభిప్రాయం ఉంది. ఈ పదాన్నిఅతిగా వాడుతున్నారన్న‌ది సీతారామం హీరో అభిప్రాయం. అమితాబ్ , క‌మ‌ల్ హాస‌న్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున అక్కినేని లాంటి స్టార్లు సరిహద్దులను ఎప్పుడో బద్దలు కొట్టేశారు. అందుకే ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాద‌న్న‌ది దుల్క‌ర్ స‌ల్మాన్ మాట‌.