iDreamPost
android-app
ios-app

మంచు సినిమానే మెగా మూవీ అయ్యిందా

  • Published Jun 23, 2022 | 12:01 PM Updated Updated Jun 23, 2022 | 12:01 PM
మంచు సినిమానే మెగా మూవీ అయ్యిందా

ఇవాళ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. ఇది తనకు నాలుగో మూవీ. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత కొండపొలం తీవ్రంగా నిరాశపరిచింది. రంగ రంగ వైభవంగా విడుదలకు సిద్ధమవుతోంది. ముందు జూలై 1 అనుకున్నారు కానీ తర్వాత డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ చేయబోయేదే ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. 2023 సంక్రాంతని కూడా చెప్పేశారు. నిజానికి ఆ సీజన్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. విజయ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లందరూ దాని మీదే కన్నేశారు. ఎవరు ఉంటారు ఎవరు తప్పుకుంటారు అనేది తెలియదు కానీ వైష్ణవ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోని పొంగల్ రేస్ లో నిలపడం అంటే పెద్ద సాహసమే.

దీనికి సంబంధించిన ఒక కీలకమైన ట్విస్టు ఉంది. అదేంటో తెలియాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. 2020లో కరోనాకు ముందు మంచు విష్ణు హీరోగా అహం బ్రహ్మస్మి అనే సినిమా మొదలుపెట్టారు. చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పిలిపించి పెద్ద హంగామా చేశారు. చాలా ఏళ్లుగా హిట్టు లేక సతమతమవుతున్న మనోజ్ కి ఇది ఖచ్చితంగా బ్రేక్ అవుతుందనే అంచనాలో అభిమానులు ఉండేవారు. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కానీ లాక్ డౌన్స్ తర్వాత పరిస్థితి మారిపోయింది. అహం బ్రహ్మస్మి ఆగిపోవడంతో పాటు మనోజ్ పర్సనల్ లైఫ్ లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల అతనికి దాని మీద ఆసక్తి సన్నగిల్లి వదిలేశాడు.

తీరా చూస్తే ఇప్పుడా అహం బ్రహ్మస్మినే వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. దాన్ని కొనసాగించలేనని మనోజ్ నిస్సహాయత వ్యక్తం చేశాకే వైష్ణవ్ ని లాక్ చేశారట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా హీరోలు మారడం కొత్తేమి కాదు కానీ షూటింగ్ కొంత భాగం అయ్యాక మొత్తం క్యాన్సిల్ చేసి ఇంకో కాంపౌండ్ కి సెట్ చేయడం మాత్రం అరుదే. నిజానికి రెండు కథలు ఒకటేనా కాదా అని చెప్పాల్సింది సదరు దర్శకుడే. రెండు సినిమాల పోస్టర్లు గట్రా పోల్చుకుంటే పోలికలు చాలా కనిపిస్తున్నాయి. దీని సంగతేమో కానీ ఇప్పుడీ పరిణామాలు చూస్తుంటే మంచు మనోజ్ ఇంకెప్పటికీ సినిమాలు చేయడా అనే అనుమానం వస్తోంది