iDreamPost
android-app
ios-app

Isha Negi నిన్నటి మ్యాచ్ లో తళుక్కుమన్న ఈ భామ ఎవరు? రిషబ్ పంత్ కోసమే వచ్చిందా?

  • Published Apr 29, 2022 | 11:37 AM Updated Updated Apr 29, 2022 | 4:47 PM
  • Published Apr 29, 2022 | 11:37 AMUpdated Apr 29, 2022 | 4:47 PM
Isha Negi నిన్నటి మ్యాచ్ లో తళుక్కుమన్న ఈ భామ ఎవరు? రిషబ్ పంత్ కోసమే వచ్చిందా?

ఐపీఎల్ 2022, గురువారం కేకేఆర్, ఢిల్లీ మధ్య మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. ప్రతి సీజన్ ఐపీఎల్ లో మన కెమెరామెన్లు ఆటతో పాటు ఆ ఆటకి వచ్చిన భామలని కూడా కవర్ చేస్తున్నారు. దీంతో ఐపీఎల్ ప్రతి సీజన్ లో కొంతమంది అమ్మాయిలు బాగా పాపులర్ అవుతున్నారు. నెటిజన్లు కూడా ప్రతిరోజూ జరగబోయే మ్యాచ్ లో ఈ సారి ఏ కొత్త అమ్మాయిని చూపిస్తారు? ఆ అమ్మాయి ఎవరని ఎలా తెలుసుకోవాలని ట్రైచేస్తున్నారు. తాజా మ్యాచ్ లో కూడా ఓ భామ తళుక్కుమంది.

ఇంకేముంది నెటిజన్లు ఈ భామ ఎవరు అని వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఆ భామ ఎవరో తెలిశాక అంతా ఆశ్చర్యపోయారు. కేకేఆర్, ఢిల్లీ జట్ల మధ్య కనిపించిన ఆ అమ్మాయి పేరు ఇషా నెగి. ఇషా ఓ బిజినెస్ ఉమెన్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. గతంలో వీరి సోషల్ మీడియాలో ఇషా, రిషబ్ ఇద్దరూ చనువుగా ఉన్న ఫోటోలని కూడా షేర్ చేశారు. ఇషా గతంలో ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలలో కనిపించలేదు. కేకేఆర్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ భామ కనపడటంతో, ఈ న్యూస్ వైరల్. నెటిజన్లు ఇషా నెగి కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

ఇక తన ప్రియుడు రిషబ్ పంత్ ఆటని చూడటానికి వచ్చిన ఇషాకి నిన్న నిరాశే మిగిలింది. రిషబ్ పంత్ క్రీజులోకి దిగాక అయిదు బంతులని ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ కెప్టెన్ గా మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించుకున్నాడు రిషబ్. ఇక రిషబ్ కోసం ఇషా రావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం వైరల్ గా మారింది.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş