వావ్… వాట్ ఏ మ్యాచ్. ఐపీఎల్లో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని మ్యాచ్. ఈ సీజన్ మొత్తానికి గుర్తుండిపోయే మ్యాచ్. ఇద్దరు సమఉజ్జీలు మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్కంఠతో వారాంతం ఐపీఎల్లో క్రీడా అభిమానులకు కన్నుల పండుగగా జరిగింది. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠ కలిగించింది. ఇరు జట్లు పోటాపోటీగా స్కోర్ చేయడంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది.
చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు ముంబై ఇండియన్స్ వేసిన బ్రేక్ మాములుగా లేదు. ఇప్పటికే ఆరు వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో పైన ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఖచ్చితంగా విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా పెట్టు కోవాలి అనుకున్న ముంబై ఇండియన్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో రెండు జట్లు పోరాటం లో చివరకు ముంబై ఇండియన్స్ దే పైచేయి అయ్యింది. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి న రెండు జట్లు క్రీడా అభిమానులకు ఐపీఎల్ మజా అందించాయి. ముఖ్యంగా తెలుగుతేజం అంబటి రాయుడు, ముంబై ఇండియా స్టార్ బ్యాట్మెన్ కిరోన్ పోలార్డ్ లు అద్భుతమైన ఆట తీరుతో పరుగుల వరద పారించారు. మొదట చెన్నై బాటింగ్ లో 27 బాల్స్ లోనే 72 స్కోర్ చేసిన రాయుడు కి దీటుగా పోలార్డ్ సైతం ముంబై ఇండియన్స్ కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 34 బాల్స్ లో 87 రన్స్ చేసిన పోలార్డ్ ఆశలు వదులుకున్న ముంబైకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ మొత్తం మీద ఫోర్లు, సిక్స్ ల మోత మోగింది. చెన్నై ఇన్నింగ్స్ లో ఫోర్లు కంటే సిక్స్ లు ఎక్కువ పడ్డాయి. ఫోర్లు కేవలం 14 పడితే, సిక్స్ లు ఏకంగా 16 నమోదు అయ్యాయి. దీనిలో రాయుడు 7 సిక్సర్లు వేస్తే, మోయిన్ ఆలి 5, ఓపెనర్ డుప్లేసెస్ 4 సిక్స్ లు కొట్టడం విశేషం. అలాగే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లోనూ 14 సిక్స్ లు, 16 ఫోర్లు పడ్డాయి.
మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెన్నైను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించాడు. మొదటి ఓవర్లోనే ఫామ్లో ఉన్న ఓపెనర్ రుతు రాజ్ గైక్వాడ్ వికెట్ను కోల్పోయిన చెన్నై ఏమాత్రం తొణకలేదు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ బ్యాట్ కి పని చెప్పాడు. గ్రౌండ్ కు నలుమూలల బౌండరీలు కురిపిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలీ, డూ ప్లేస్ స్ ఇద్దరు వికెట్ పడకుండా ఎంతో జాగ్రత్తగా ఆడుతూ బౌండరీలు వాన కనిపించడంతో చెన్నై స్కోర్ పరుగెత్తింది. వీరి భాగస్వామ్యం విడదీసేందుకు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పదేపదే బౌలర్ల మార్చినా ఫలితం లేకపోయింది. 36 బాల్స్ లో 58 రన్స్ చేసిన అలీ 11 ఓవర్లో అయిపోవడంతో, తర్వాత వచ్చిన సురేష్ రైనా కేవలం 2 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. సురేష్ రైనా వికెట్ పడిన వెంటనే అర్థ సెంచరీ సాధించిన ఓపెనర్ డు ప్లేసెస్ సైతం పోలార్డ్ బౌలింగ్లో వెంట వెంటనే అవుట్ కావడంతో చెన్నై స్కోర్ వేగం తగ్గుతుంది అని అంతా భావించారు. అయితే ఐదో వికెట్ గా క్రీజ్లోకి వచ్చిన అంబటిరాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వేసిన ప్రతి బంతిని బౌండరీ తరలించేలా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సైతం అతడి బ్యాటింగ్ వేగం తగ్గలేదు. డెత్ ఓవర్లలో అద్భుతంగా ప్రత్యర్థిని కట్టడి చేస్తాం అని పేరున్న బుమ్రా, బౌల్ట్ బౌలింగ్లోనూ రాయుడు సిక్స్ లు కొట్టడంతో చెన్నై స్కోర్ ఎక్కడా ఆగలేదు. మరో ఓవర్ ఉంటే రాయుడు ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు అనిపించింది. చివరకు 27 బాల్స్ లో 72 స్కోర్ చేసి రాయుడు చెన్నైకు 218 పరుగుల అద్భుతమైన స్కోరును సాధించాడు.
భారీ స్కోరును వచ్చే దించేందుకు రంగంలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో భారీ షాట్లు ఆడలేకపోయాడు. కీలకమైన మ్యాచ్లలో అద్భుతంగా ఆడుతాడు అని పేరున్న రోహిత్ శర్మ షాట్లు ఆడేందుకు చాలా కష్టపడ్డాడు. భారీ షాట్ లు ఏవి కనెక్ట్ కాకపోవడం తో అసహనానికి గురయ్యాడు. 24 బాల్స్ లో 35 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వికెట్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులు సాధించి జడేజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రంగంలోకి దిగిన కృనాల్ పాండ్యా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. అయితే అంతలోనే ఓపెనర్ డికక్ 38 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అప్పటికే ముంబై స్కోరు చాలా వెనుకబడి ఉంది. విజయానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో, చాలా ఎక్కువ రన్ రేట్ సాధించాల్సిన స్థితి లో క్రీజ్లోకి వచ్చిన పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఈ ఐపీఎల్ లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. ఇప్పటివరకు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా పేరుమీద ఉన్న 18 బాల్స్ లో హాఫ్ సెంచరీ రికార్డును పొలర్డ్ చేరిపేశాడు. 17 బాల్స్ లో అర్థ సెంచరీ సాధించి ముంబైకు విజయం మీద ఆశలు కల్పించాడు. అయితే 17 ఓవర్ లో కృనాల్ పాండ్యా 32 రన్స్ చేసి అవుట్ కావడంతో ముంబై ఆశలు సన్నగిల్లాయి. దీనికితోడు ముంబై ఇండియన్స్ స్కోర్ 17 ఓవర్లలో శ్యామ్ కరెన్స్ 2 రన్స్ ఇచ్చి, కృనాల్ పాండ్యా వికెట్ తీయడంతో ఒక్కసారిగా స్కోర్ మందగించింది. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా రెండు శసిక్స్ లు వేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నేసం డక్ అవుట్ అవడంతో చివరి వరకు 16 రన్స్ కొట్టాల్సి వచ్చింది.
ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని పోలార్డ్ ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్ ఎంగిడి వేయడంతో మొదటి బాల్ రెండు రన్స్ చేసాడు. తర్వాత బాల్ డాట్ అయ్యింది. మూడు నాలుగు బాల్స్ ఫోర్లు గా తరలించి, అయిదో బాల్ ను సిక్సర్ గా మాలిచాడు. దీంతో చివరి బంతికి రెండు రన్స్ కొట్టాల్సిన స్థితిలో మిగిలిన రెండు రన్స్ సాధించి ముంబైకు చిరస్మరణీయ విజయం అందించాడు. పోలార్డ్ క్యాచ్ ను చెన్నై ఫీల్డర్ డూ ప్లేస్ వదిలేయడం, దానిని పోలార్డ్ చక్కగా వినియోగించుకోవడం తో ముంబై విజయంలో కీలక మలుపు అయింది.
ఆదివారం రెండు కీలకమైన మ్యాచ్ లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఢీకొన బోతోంది. వార్నర్ నుంచి కెప్టెన్సీని అందుకున్న విలియమ్సన్ ఏ మేరకు హైదరాబాద్ జట్టుకు ఉపయోగపడతాడు, విజయాల బాట నడిపిస్తాడు అన్నది కీలకంగా మారింది. మరో మ్యాచ్లో పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లే ఆ ప్లేస్లో జోరుగా పోటీపడుతున్న జట్లు ఈ కీలక మ్యాచ్ లను ఖచ్చితంగా విజయం సాధించాలన్న కోణంలో ఆడే అవకాశం ఉంది.