iDreamPost
android-app
ios-app

దంచేసిన ఢిల్లీ…కోల్కతా కుదేల్!

దంచేసిన ఢిల్లీ…కోల్కతా కుదేల్!

ఢిల్లీ అరి వీర బాటింగ్ దెబ్బకు కోల్కతా కుదేలయింది. కోల్కతా ఏ మాత్రం పోటీ ఇవ్వలేని టీమ్ గా మిగిలిపోయింది. చివరి వరకు పోరాడి కేవలం 1 రన్ తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన బాటింగ్ ఎంత బలంగా ఉంటుందో చూపించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ కిట్టు బౌలింగ్లో అటు బౌలింగ్ లో అత్యంత బలమైన జట్టుగా నిరూపితమైంది. కోల్కతా టీమ్ పై రెండు విభాగాల్లోనూ పైచేయి సాధించిన ఢిల్లీ అద్భుతమైన ఆటతీరుతో కోల్కతా మీద గెలిచి తన ప్లేఆఫ్ రేస్ ను మరింత ముందుకు తీసుకు వెళ్ళింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదట కోల్కతా ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఎప్పటిలాగానే కోల్కతా ఓపెనర్లు నితీష్ రానా, శుభమాన్ గిల్ విఫలం అయ్యారు. నితీష్ రానా తన వైఫల్యాన్ని మరోసారి చాటుకొని అతి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. శుభమన్ గిల్ క్రిజులో ఉన్నప్పటికీ చాలా స్లో గా ఆడాడు. కోల్కతా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుందని అనుకున్నప్పటికి ఒకరి తర్వాత ఒకరుగా సునీల్ నరైన్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వెనువెంటనే అవుట్ కావడంతో కోల్కతాకు బ్యాటింగ్ కష్టాలు మొదలయ్యాయి. వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడంతో కోరు ముందుకు వెళ్లడం కష్టమైంది. ఓపెనర్ గిల్ సైతం 43 రన్స్ చేసి వెన్ను తిరగడంతో కోల్కత్తా మళ్లీ పుంజుకోలేక లేకపోయింది. చివర్లో కోల్కతా స్టార్ బ్యాట్స్మెన్ ఆండ్రూ రస్సెల్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించడం తో కోల్కతా పరువు నిలిపేలా 154 రన్స్ చేయగలిగారు.

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ దూకుడును కోల్కతా బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేక పోయారు. 155 రన్స్ లక్ష్యాన్ని చాలా సులభంగా ఆడుతూపాడుతూ ఢిల్లీ బ్యాట్స్మెన్ లు చేధించారు. ఓపెనర్లు పృథ్వీ షా, శేఖర్ ధావన్ లు ఏకంగా 132 రన్స్ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. కోల్కతా బౌలర్లు ఎవరు ప్రభావం చూపలేకపోయారు. పృథ్వీ షా అలవోకగా ఆడుతూ అన్నివైపుల చక్కని షాట్లతో అలరించాడు. సిరీస్ మొత్తం మంచి ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్ 42 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత, క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి పృద్వి షా తమ లక్ష్యాన్ని అనుకున్న పరుగులు పూర్తి చేశాడు. ఢిల్లీ దూకుడు చూస్తే వారికి 200 స్కోర్ కూడా చాలా చిన్నగా అవుతుందా అనిపించింది. ముఖ్యంగా ఓపెనర్ పృథ్వీషా ఈ మ్యాచ్లో ఎన్నడూ లేనంతగా విరుచుకుపడడం విశేషం. ఫోర్లు సిక్సర్లతో అతడు విధ్వంసమే సృష్టించాడు. 41 బాల్స్ లో 82 రన్స్ కొట్టిన పృథ్వీ షా ఇంకా లక్ష్యం 9 పరుగులు ఉన్న తరుణంలో అవుటయ్యాడు. అయితే అప్పటికే కోల్కతా కు తీరని నష్టం చేసిన షా ఆ జట్టుని కోలుకోనివ్వలేదు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషిబ్ పంత్ సైతం 16 నుంచి కొట్టి చివర్లో అవుటయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మాన్ లక్ష్యాన్ని అలవోకగా సాధించి ఢిల్లీ కు తిరుగులేని విజయాన్ని అందించారు.

శుక్రవారం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు ఈ మ్యాచ్లో పంజాబ్ ను ఎలాగైనా ఓడించి పాయింట్స్ టేబుల్ లో పైన ఉండాలని తహతహలాడుతోంది. మరోపక్క ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా విజయం సాధించాలన్న మ్యాచ్లో తాడోపేడో తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్ సిద్ధమవుతోంది. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్ కూడా ఆసక్తి రేపుతోంది.