iDreamPost
android-app
ios-app

Flipkartలో iPhone 13ని రూ. 54,909కి కొనుక్కోవచ్చు. iPhone 14 లాంచ్‌కు ముందు త‌గ్గిన iPhone 13 రేట్లు.

  • Published Aug 01, 2022 | 7:45 PM Updated Updated Aug 02, 2022 | 5:42 PM
Flipkartలో  iPhone 13ని రూ. 54,909కి కొనుక్కోవచ్చు. iPhone 14 లాంచ్‌కు ముందు త‌గ్గిన  iPhone 13 రేట్లు.

Apple iPhone 13 సిరీస్‌లో Apple iPhone 13 Mini, Apple iPhone 13, Apple iPhone 13 Proతోపాటు Apple iPhone 13 Pro Max అనే నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఐఫోన్ 14 వ‌స్తోంది కాబ‌ట్టి, ఈ మోడల్స్ పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి.

ఆపిల్ ఈ సెప్టెంబర్‌లో 6.1 ఐఫోన్ 14, 6.1 ఐఫోన్ 14 ప్రో, 6.7-అంగుళాల ఐఫోన్ 14 మాక్స్ తోపాటు 6.7-అంగుళాల ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఇప్పుడు, ఐఫోన్ 14 లాంచ్‌కు ఆపిల్ సిద్ద‌మ‌వుతోంది కాబ‌ట్టి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అవుట్‌గోయింగ్ ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల‌పై ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి. ఇది ఆపిల్ మార్కెటింగ్ వ్యూహం కూడా. కొత్త మోడ‌ల్స్ వ‌స్తే పాత వాటిని మీద మోజు త‌గ్గుతుంది. కాబ‌ట్టి పాత మోడ‌ల్స్ మీద డిస్కౌంట్స్ ఇస్తుంది. Apple iPhone 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ తో బేస్ మోడల్ రేటు తగ్గింపు ధరతో రూ.73,909. దీనితోపాటు ఎక్సేంజ్ ఆఫ‌ర్ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 19,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అంటే పాత ఫోన్ తో ఎక్సేంజ్ చేసుకొంటే 128GB స్టోరేజ్‌తో iPhone 13 రేటు రూ. 54,909.

iPhone 13 సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతోపాటు ఫ్లాగ్‌షిప్ A15 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. అందుకే ఇది సూప‌ర్ ఫాస్ట్. స్మార్ట్‌ఫోన్ 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో, 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరాతో ఫోటోలు తీయ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఐఫోన్స్ లో ఈ 13 సీరీస్ లో బ్యాట‌రీ ఎక్కువ‌. 17 గంటల వరకు వీడియోలు చూడొచ్చు. ఒక్క‌సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, రోజంతా వ‌స్తుంది.

పెరుగుతున్న కాంపోనెంట్ ఖర్చులతోపాటు, Pro , నాన్-ప్రో ఐఫోన్‌లను మ‌ధ్య తేడాను చూపించాల‌నుకొంటోంది Apple. iPhone 14 Pro , iPhone 14 Pro Max వరుసగా $1099, $1199కి పెరుగుతాయి. ఒక ఐఫోన్ 13 మినీని డిస్‌కంటిన్యూ చేయ‌నుంది. ఆ వెర్ష‌న్ ను మాక్స్ వెర్షన్‌తో భర్తీ చేస్తుంది. అందువ‌ల్ల రేటు సుమారు $300 వ‌ర‌కు పెర‌గొచ్చు.

ఐఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్‌పై చాలా అంచ‌నాలున్నాయి. iPhone 13 సీరీస్ మీద కొన్ని విమ‌ర్శలు వినిపించాయి. చిన్న‌చిన్న చేంజెస్ తోనే కొత్త సీరీస్ ను తీసుకొచ్చార‌న్న‌ది కస్ట‌మ‌ర్ల కామెంట్స్. అందుకే ఈ iPhone 14 లో డిజైన్, ఇంకొంత క్లారిటీతో కెమెరా, బెట‌ర్ బ్యాట‌రీ ఉండ‌బోతోంది.

ఐఫోన్ 14 సిరీస్ రెండు ప్రో మోడల్స్ కెమేరా పిక్సల్ రేంజ్ ను పెంచ‌నున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48MP , 12MP అల్ట్రా-వైడ్ , టెలిఫోటో లెన్స్‌తో రాన్నాయి. ఇక ప్రీమియం క‌స్ట‌మ‌ర్లు కోరుతున్న‌ట్లు iPhone 14 సిరీస్ 8K వీడియోకు సపోర్ట్ నిస్తుంది. అంటే, బెట‌ర్ ఫోటోలు, వీడియోలు.