iDreamPost
కెమెరా బెటర్ అయ్యింది. ఐఫోన్ 14 సిరీస్ రెండు ప్రో మోడల్ ల్లో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48MP కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ , టెలిఫోటో లెన్స్‌తో ఉండనున్నాయి. ఇంకో సంగతి iPhone 14 సిరీస్ తో, 8Kలో వీడియోలు తీయొచ్చు.
కెమెరా బెటర్ అయ్యింది. ఐఫోన్ 14 సిరీస్ రెండు ప్రో మోడల్ ల్లో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48MP కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ , టెలిఫోటో లెన్స్‌తో ఉండనున్నాయి. ఇంకో సంగతి iPhone 14 సిరీస్ తో, 8Kలో వీడియోలు తీయొచ్చు.
iDreamPost
అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్ 14ను ఈ సెప్టెంబర్‌లో రీలీజ్ చేయడానికి ఆపిల్ సిద్ధమవుతోంది. 6.1-అంగుళాల ఐఫోన్ 14, 6.1-అంగుళాల ఐఫోన్ 14 ప్రో, 6.7-అంగుళాల ఐఫోన్ 14 మాక్స్ తోపాటు, 6.7-అంగుళాల ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ను విడుదల చేయనుంది. ఇప్పుడు, iPhone 14 లాంచ్‌కు ముందు, iPhone 13పై భారీ తగ్గింపులను ఫ్లిప్ కార్టు, అమెజాన్ లు అందిస్తున్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ వాడితే, iPhone 13పై రూ. 4000 తగ్గింపును Flipkart ఇస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 19,000 వరకు తగ్గింపును అందిస్తోంది Flipkart. అంటే Apple iPhone 13 ధర, రూ. 54,909కి తగ్గింది. మరో ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో Apple iPhone 13 కొంటే, 5 శాతం క్యాష్‌బ్యాక్ తో కూడా ఉంది. రేటు మరింతగా తగ్గనట్లే.
iPhone 12తో పోలిస్తే Apple iPhone 13 సిరీస్ లో చాలా మంచి కెమేరా, బెస్ట్ బ్యాటరీ ఉన్నాయి. ఈ సీరీస్ లో iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Proతోపాటు iPhone 13 Pro Max అనే నాలుగు స్మార్ట్‌ఫోన్ వేరియంట్స్ ఉన్నాయి. ప్రో సీరీస్ కొంటే కెమేరాతో పొఫెషనల్ గా పోటోలు, వీడియోలు తీయొచ్చ. నిజానికి సినిమాయే తీయొచ్చు. iPhone 13 2532×1170 పిక్సెల్ రిజల్యూషన్ 460ppi పిక్సెల్ డెన్సిటీతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 13 చాలా పవర్ ఫుల్ A15 బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్ తో సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది.
Apple iPhone 14 ధర ఎక్కువగా ఏం ఉండకపోవచ్చు. మార్కెట్ లో లీడర్ గా నిలబడాలంటే భారీ రేటుతో ఇబ్బంది కాబట్టి, iPhone 13 ధరతో సమానంగా అంటే iPhone 14 సిరీస్ USలో $799 వద్ద రేటు మొదలుకావచ్చు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ ధర దాదాపు రూ. 63,200. కాని, ఐఫోన్ 14 ధర ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుందంటే రూ. 79,900 రేటును ఫిక్స్ చేయొచ్చు.
ఐపోన్ 12తో పోలిస్తే, 13 మోడల్ పెద్దగా మార్పులు లేవన్నది ఓ విమర్శ. కాని ఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్ కొత్త డిజైన్ తో వస్తోంది. కెమెరా బెటర్ అయ్యింది. ఐఫోన్ 14 సిరీస్ రెండు ప్రో మోడల్ ల్లో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48MP కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ , టెలిఫోటో లెన్స్‌తో ఉండనున్నాయి. ఇంకో సంగతి iPhone 14 సిరీస్ తో, 8Kలో వీడియోలు తీయొచ్చు.
ఐఫోన్ 14 సిరీస్ పరికరాల బేస్ స్టోరేజ్ కెపాసిటీ 64GBగా ఉంటుందన్ని ఎక్కువమంది అంచనా. ఇదంతా ప్రైస్ వార్ లో భాగంగా బేస్ వేరియంట్ ని ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడానికి చేసిన ఎర్పాటే కావచ్చు.
ఐఫోన్ 13 మూడు స్టోరేజ్ వేరియంట్స్ లో, 128GB, 256GB , 512GBతో లభిస్తుంది.