నేటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.ఇరు రాష్ట్రాలలో మార్చి 4 నుంచి మార్చి 23 వరకూ ఇంటర్ ఇంటర్ జరుగుతాయి.రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.మొత్తం 411 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.ఇంటర్‌ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.ఈసారి ఏపీలో విద్యార్థులు హాల్ టికెట్‌ను ఇంటర్నెట్ నుంచీ డౌన్‌లోడ్ చేసుకొని ప్రిన్సిపల్ సంతకం అవసరం లేకుండానే పరీక్షలు రాసే వెసులుబాటును విద్యార్థులకు కల్పించారు.

ఏపీలో పరీక్ష కేంద్రాల గుర్తింపుకు ప్రత్యేక యాప్:
పట్టణ,నగర ప్రాంతాలలో పరీక్షాకేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు.పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి “IPE సెంటర్ లొకేటర్” అనే యాప్‌ను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ లేదా గుగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లొకేటర్ యాప్‌లో సెంటర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే GPS విధానం ద్వారా చిరునామా, సెంటర్‌ వివరాలు కనిపిస్తాయి.పరీక్ష కేంద్రానికి వెళ్లే దారిని ‘గుగూల్‌ మ్యాప్’ చూపిస్తుంది.విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.1800 2749868, 0866 2974130 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యవచ్చని బోర్డు అధికారులు వివరించారు. 9391282578 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో సమస్యలు తెలియజేసే అవకాశాన్ని కూడా కల్పించారు.

తెలంగాణలో కూడా ఇంటర్ పరీక్షల ఏర్పాటు పూర్తి:
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయబోతున్నారు.విద్యార్థులంతా 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనే నిబంధన పెట్టారు.ఈసారి కూడా నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ, మొబైల్సూ తీసుకురాకూడదనే కండీషన్ పెట్టారు. ప్రతీ సెంటర్‌లో 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు.

Show comments