iDreamPost

Khiladi : ముగ్గురి మధ్య రసవత్తరమైన పోటీ

Khiladi : ముగ్గురి మధ్య రసవత్తరమైన పోటీ

మాస్ మహారాజ కొత్త సినిమా ఖిలాడీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. క్రాక్ వచ్చిన ఏడాదికి పైగా గ్యాప్ తో ఫిబ్రవరి 11 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించారు. నిజానికి డిసెంబర్ లోనే రావొచ్చనే అంచనాలకు భిన్నంగా తేదీని ఫిక్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. కానీ అదే నెలలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్, 83 లాంటి భారీ చిత్రాలు పోటీలో ఉండటంతో రిస్క్ ఎందుకని సేఫ్ గేమ్ ని ఎంచుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు తీసిన రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఖిలాడీకి ఫిబ్రవరిలో కూడా కాంపిటీషన్ మాములుగా లేదు. అడవి శేష్ హీరోగా సోనీ సంస్థ మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన మేజర్ అదే రోజు పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాబోతోంది. ఇదే అనుకుంటే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా రంగంలోకి దిగుతోంది. ఒకవేళ ఏదైనా చిన్న వాయిదా ఉన్నా 14కి వెళ్ళొచ్చేమో కానీ ప్రస్తుతానికి పదోకొండుకే కట్టుబడి ఉంది. వీటి మధ్య నెగ్గుకురావడం అంత సులభం కాదు. కాకపోతే మాస్ ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ మాత్రం ఖిలాడే అవుతాడు. అందులో సందేహం అక్కర్లేదు. క్రాక్ రేంజ్ లో టాక్ వచ్చిందా హ్యాపీగా వసూళ్ల మోత మ్రోగిపోతుంది.

ఫస్ట్ కాపీ సిద్ధమవుతున్న దశలో కూడా ఖిలాడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. పెంచుకునే వెసులుబాటు లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. మంత్రులతో చర్చలు జరుగుతున్నాయి కానీ అవేవి కొలిక్కి రాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనవరిలో వచ్చే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజు కలెక్షన్లను బట్టి బిజినెస్ అడ్జస్ట్ మెంట్ ల గురించి ఒక అంచనాకు రావొచ్చు. అందుకే ఖిలాడీ కూడా ఆచార్య రూటు తీసుకుని మూడు నెలలు వాయిదాకే మొగ్గు చూపాడు. వచ్చే నెల ట్రైలర్ విడుదల చేసేందుకు టీమ్ ప్లానింగ్ లో ఉంది

Also Read : Radhe Shyam : పాత పాటే పాడుతున్న ప్రభాస్ నిర్మాతలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి