రెండురోజుల క్రితం ఇండియన్ 2 సినిమా చిత్రీకరణ సమయంలో భారీ క్రేన్ కుప్పకూలడంతో ముగ్గురు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే ఈ ప్రమాద విచారణను సీబీసీఐడీకి తమిళనాడు ప్రభుత్వం అప్పగించింది..విచారణ ప్రారంభించిన సీబీసీఐడీ షూటింగ్ లో పాల్గొన్న మొత్తం 22 మందిని విచారించాలని నిర్ణయించింది.
కాగా ఈ ప్రమాద ఘటనపై నాలుగు సెక్షన్లపై పోలీసులు అభియోగాలు నమోదు చేసారు. నిర్మాతలతో పాటు, క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దానితో పాటుగా కమలహాసన్, శంకర్, కాజల్ కు సమన్లు జారీ చేశారు. ఇండియాలో సినిమా షూటింగులకు 60 అడుగుల క్రేన్ లు మాత్రమే వినియోగించడానికి అనుమతులు ఉన్నాయి. కానీ ఇండియన్ 2 షూటింగ్ లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 100 అడుగుల భారీ క్రేన్ ను వినియోగించారు..
Read Also: శంకర్,కమల్ ఇండియన్ 2 షూటింగ్ లో తీవ్ర ప్రమాదం : 3 మృతి
ఈ ఘటనలో తన తప్పేమి లేదని తాను ఎంత వారిస్తున్నా కెమెరా మరియు ప్రొడక్షన్ బృందం తన మాటలు పట్టించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు..
షూటింగ్ ప్రమాదంలో మృతిచెందిన వారికి కమల్ హాసన్ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక్కొక్కరికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ ప్రమాదం నుండి కమల్ హాసన్, శంకర్, కాజల్ అగర్వాల్ మరియు మిగిలిన యూనిట్ సభ్యులు త్రుటిలో తప్పించుకున్నారు.. చిత్రీకరణ సమయంలో 100 అడుగుల భారీ క్రేన్ యూనిట్ సభ్యులున్న టెంట్ పై పడటంపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.