iDreamPost
iDreamPost
2003లో అంజు బాబీ జార్జ్ ఈ ఫీట్ సాధించిన తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ చోప్రా ఆదివారం చరిత్ర సృష్టించాడు. అటు ఒలంపిక్స్, ఇటు వరల్డ్ అథ్లెటిక్స్ రెండింటిలోనూ పతకం గెల్చిన తొలి భారతీయుడు నీరజ్. నీరజ్ తన నాలుగో ప్రయత్నంలో, 88.13 మీటర్ల త్రో చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు, కాగా, అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల త్రో నమోదు చేసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
ఇదే పోటీలో పాక్ ఆటగాడు నీరజ్ కూడా పోటీపడ్డాడు. కాని, పతకాన్ని గెలవలేకపోయాడు. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో ఎం మాట్లాడాడో నీరజ్ చెప్పాడు. ఫైనల్‌లో అద్భుతంగా విసిరినందుకు అభినందించాడు.
“పోటీ తర్వాత అర్షద్‌తో మాట్లాడాను. నువ్వు బాగా విసిరావని అతనితో చెప్పాను. తన మోచేతిలో ఇబ్బంది ఉందన్నాడు. నేను అతనిని గొప్ప త్రో చేశాడని అభినందించాను. గాయం నుంచి కోలుకొని ఫైనల్స్ కు రావడం ప్రశంసనీయం. అతను జావెలిన్‌ను 86 మీటర్లకు పైగా విసిరాడు” అని వర్చువల్ విలేకరుల సమావేశంలో నీరజ్ వివరించాడు.
2018లో జకార్తా ఆసియా క్రీడల పోడియం వద్ద, అర్షద్ , నీరజ్‌లు పలకరించుకొన్న ఫోటో వైరల్‌గా అయ్యింది.
అంతెందుకు, ఫైనల్‌లో నాల్గవ ప్రయత్నం తర్వాత నీరజ్ తన తొడ ఇబ్బంది పెట్టిందని నీరజ్ చెప్పాడు. “4వ త్రో తర్వాత, నా తొడలో కొంచెం బాధ అనిపించింది. కానీ నేను విసిరేయగలనని తేల్చుకున్నాను. కాబట్టి పట్టీ కట్టుకున్నాను. తొడ బాగానే ఉంటుంది “అని నీరజ్ చెప్పాడు.