మార్చ్ 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ళు రద్దు

దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోన వైరస్ కట్టడికి ఇప్పటికే జనతా కర్ఫ్యూకి పిలుపు నిచ్చిన కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తు రాష్ట్రాలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో వైరస్ కట్టడికి మరో అడుగు ముందుకు వేసింది.

భారత్ లో కరోన వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ వైరస్ సోకిన వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూ 341కి చేరి ఆరుగురు మరణించడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .
ఈ మార్చ్ 31వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది . దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్ళు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి.

Show comments