iDreamPost
android-app
ios-app

వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ కూడా ఫిక్స్

  • Published Jun 12, 2024 | 5:58 PM Updated Updated Jun 12, 2024 | 5:58 PM

Kiran Bedi Biopic : ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గురించి అందరికీ తెలిసిందే. ఈమె భారత దేశంలో తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్. ఇక మహిళ ఐపీఎస్ ఆఫీసర్ గా కిరణ్ బేడి దేశానికి చేసిన సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ క్రమంలోనే ఆమె జీవితంలో వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు పై ఓ బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. అలాగే తాజాగా ఆ బయోపిక్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

Kiran Bedi Biopic : ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గురించి అందరికీ తెలిసిందే. ఈమె భారత దేశంలో తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్. ఇక మహిళ ఐపీఎస్ ఆఫీసర్ గా కిరణ్ బేడి దేశానికి చేసిన సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ క్రమంలోనే ఆమె జీవితంలో వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు పై ఓ బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. అలాగే తాజాగా ఆ బయోపిక్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

  • Published Jun 12, 2024 | 5:58 PMUpdated Jun 12, 2024 | 5:58 PM
వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ కూడా ఫిక్స్

సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ అనేది కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా ఈ బయోపిక్ ట్రెండ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతునే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగల్లోని ప్రముఖలు జీవితాలపై సినిమాలు చాలానే తెరకెక్కించారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తుంది. పైగా మంచి కలెక్షన్స్ ను కూడా వసూలు చేస్తాయి. అందుకే చాలామంది దర్శక, నిర్మాతలు ఇలాంటి బయోపిక్ లు తీయడం పై ఎక్కువ ఇంట్రేస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ త్వరలోనే తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితం పై ఓ బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

 ఐపీఎస్ ఆఫీసర్ ‘కిరణ్ బేడీ’ గురించి అందరికీ తెలిసిందే. ఈమె భారత దేశంలో తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్. ఇక మహిళ ఐపీఎస్ ఆఫీసర్ గా కిరణ్ బేడీ దేశానికి చేసిన సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ముఖ్యంగా ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అలాగే ఒక డైనమిక్ లేడీగా నేటి తరానికి ఆమె చాలా ఇన్సిఫిరేషన్ అయ్యారు. ఈ క్రమంలోనే..  కిరణ్ బేడీ జీవితం మీద కూడా ఒక బయోపిక్ ను తీయనున్నారు. అయితే కిరణ్ బేడి  బయోపిక్ కు దర్శక–నిర్మాత, రచయిత కుశాల్‌ చావ్లా తెరకెక్కిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా ఈ బయోపిక్ టైటిల్  టైటిల్ పేర్లు తెరపైకి వినిపిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ బయోపిక్ కు ‘ది నేమ్‌ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్‌’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాను డ్రీమ్‌ స్లేట్‌ పిక్చర్స్‌ పతాకంపై గౌరవ్‌ చావ్లా నిర్మిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

అయితే   ఈ బయోపిక్ లో కిరణ్‌ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు… ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మూవీ మేకర్స్ పేర్కొన్నారు. ఇక కిరణ్ బేడి 1966లో జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యంగా పాండిచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్‌ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్‌ బేడీ. ఈ నేపథ్యంలోనే  వెండితెరపై ఆమె బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ లోని ఆమె పాత్రలో ఎవరు చేస్తారు అనేది చిత్ర బృందం ఇంక ప్రకటించలేదు. మరి, కిరణ్ బేడీ జీవితం పై బయోపిక్ తెరకెక్కడం పై మీ అభిప్రాయలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.