మన దేశంలో ఉండే వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఎంత ముఖ్యమైనవో అందరికి తెలిసిందే. పాన్ ఆధార్ తో లింక్ చేయడం 2017 జులై 1 తేదీ నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్ తో పాన్ ను లింక్ చేయడానికి కేంద్రం చాలా సార్లు గడువును పొడిగించింది. ఈక్రమంలో జూన్ 30వ తేదీలోపు పాన్ ను ఆధార్ కు లింక్ చేయకపోతే , అలాంటి పాన్ కార్డులు చెల్లుబాటు కావని ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) పలుమార్లు హెచ్చరించింది. పాన్ ఆధార్ లింక్ చేసేందుకు నిన్నటితో గడువు ముగియనున్న విషయం అందరికి తెలిసిందే.
ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. అయితే చివరి రోజు కావడంతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో ప్రజలు పోటెత్తారు. దీంతో చాలా మందికి చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్ లో సమస్యలు తలెత్తాయి. ఇదే సమయంలో పాన్, ఆధార్ అనుసంధానం కోసం చెల్లింపు చేసిన తరువాత చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో కొంతమంది సమస్యలు ఎదుర్కొన్నారని తమ దృష్టికి వచ్చినట్లు ఐటీ శాఖ కూడా తెలిపింది. ఈ మేరకు ఓ కీలక ప్రకటనను ఐటీ శాఖ చేసింది. చెల్లింపులు చేసిన తరువాత ఐటీ వెబ్ సైట్ లో లాగిన్ అయి ఈ-పే ట్యాక్స్ సెక్షన్లో చెల్లింపు పూర్తయిందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఆధార్, పాన్ లింక్ కోసం చలాన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నగదు చెల్లింపు జరిపిన వెంటనే పాన్ కార్డు హోల్డర్స్ రిజిస్టర్డ మెయిల్ కు మెసేజ్ రూపంలో చెల్లింపులకు సంబంధించిన రశీదు కాపీ వస్తుంది.
డబ్బులు చెల్లించడం పూర్తైన తరువాత కూడా ఆధార్ పాన్ లింక్ కాకుండే..అలాంటి వాటినీ పరిగణలోకి తీసుకుంటాం” అని ఐటీశాఖ ప్రకటన లో పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగేందుకు కేంద్రం.. ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆధార్, పాన్ లనులింక్ చేసుకోవాలని ఐటీశాఖ చెప్తూ వచ్చింది. అలానే పలు మార్లు గడువు పొడగించి.. చివరికి రూ.1000 జరిమానతో జూన్ 30 వరకు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది. ఇప్పుడు జులై కూడా వచ్చేసింది. ఈ నిన్నటితో చివరి తేది కూడా అయిపోయిన వేళ.. ఐటీ శాఖ పై కీలక ప్రకటన జారీ చేసింది. మరి.. ఐటీ శాఖ జారీ చేసిన ఈ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.