iDreamPost
android-app
ios-app

యరపతినేని – సీబీఐ కాలింగ్

యరపతినేని – సీబీఐ కాలింగ్

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై ఉన్న అక్రమ మైనింగ్‌ కేసునలను సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురజాలలో అక్రమ మైనింగ్‌ చేశారంటూ యరపతినేనిపై పలు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా అక్రమ మైనింగ్, అక్రమ తరలింపు తదితర కేసులు యరపతినేనిపై నమోదయ్యాయి. మొత్తం 18 కేసులు నమోదవ్వగా వాటన్నింటినీ సీబీఐకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వ హయాంలో ఈ అక్రమ మైనింగుకు యరపతినేని పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాల జారీ చేస్తే తప్పా గత చంద్రబాబు ప్రభుత్వం యరపతినేనిపై అక్రమ మైనింగ్‌ కేసులు నమోదు చేయలేదు.