నదులు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా.. అయితే ఈ వీడియో చూడండి:

నదులు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా.. అయితే ఈ వీడియో చూడండి:

ఈ భూమ్మీద ప్రాణి కోటి జీవించాలన్నా.. అభివృద్ధి జరగాలన్నా ప్రధాన వనరు నీరు. అసలు ఈ నీరు అన్నది లేకపోతే.. ఈ భూమ్మీద జీవం మనుగడే కష్టం. మరి మనం బతకడానికి మూలాధారమైన నీరు మనకు ఎక్కడ నుంచి లభిస్తోంది అంటే.. నదుల నుంచి. వర్షాలు వల్ల నీరు భూమ్మీదకు చేరి.. నదులు ఏర్పడతాయి అని తెలుసు. కానీ అవి ఎలా ఏర్పడతాయో మనకి తెలియదు. ప్రస్తుతం మనం చూస్తున్నవి.. ఇప్పటికే ఏర్పడిన నదులను. మరి ఇంతకు నది ఎలా ఏర్పడుతుందో మీరు ఎప్పుడైనా చూశారా.. లేదా.. అయితే ఈ వీడియో చూడండి. నది ఎలా ఏర్పడుతుంది.. ముందుగా ఎలా ఉంటుంది అనేది మనకు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఫారెస్ట్‌ అఫీసర్‌ ఒకరు పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో కొందరు అటవీ అధికారులు ఫూట్ పెట్రోలింగ్‌ నిర్వహించే పనిలో ఉంటారు. ఇంతలో వారికి అడవిలోంచి ఒక నీటిపాయ మైదాన ప్రాంతంలో పారుతూ కనిపిస్తుంది. అది చూసి అటవీ శాఖ సిబ్బంది ఆశ్చర్యపోతారు. వెంటనే దాన్ని వీడియో తీయడం మొదలు పెడతారు. ఇలా ఉండగానే… ఆ పాయ ముందుకు పారి.. ఓ చిన్న కాలువలా మారుతుంది. ఈ వీడియోని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

‘‘నదులు ఇలా ఏర్పడుతాయి. నదికి తల్లి అడవి. ఇవాళ ఉదయం 6 గంటలకు.. మా టీమ్‌తో ఫూట్‌ పెట్రోలింగ్‌ చేస్తుండగా.. మాకు ఇలాంటి అద్భుత దృశ్యం తారసపడింది. నదులు ఇలా ఏర్పడతాయి’’ అనే క్యాప్షన్‌తో ప్రవీణ్‌ కాస్వాన్‌ ఆ వీడియో ట్వీట్‌ చేశాడు. అంటే ఉదయం 6 గంటలకు తన టీమ్‌తో కలిసి అడవిలో ఫూట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ దృశ్యం వారి కంటబడిందని ఆయన ఉద్దేశం. అంతేకాక వంపుల్లోకి నీరు పారుతూ రావడం వల్లే నదులు ఏర్పడతాయని.. పైగా అవి అడవి నుంచే పుడతాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Show comments