iDreamPost
android-app
ios-app

PAN Card: పాన్ కార్డ్ వాడుతున్నారా? త్వరలో ఇలా చేయకపోతే రూ.10 వేలు ఫైన్!

  • Published Feb 19, 2024 | 1:30 PMUpdated Feb 19, 2024 | 1:30 PM

దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు.. పాన్ కార్డును కలిగి ఉంటున్నారు. అయితే, ఏ ఒక్కరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉన్నట్లైతే.. వారు దాని పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే వారు జరిమాన విధించాల్సి వస్తుంది.

దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు.. పాన్ కార్డును కలిగి ఉంటున్నారు. అయితే, ఏ ఒక్కరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉన్నట్లైతే.. వారు దాని పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే వారు జరిమాన విధించాల్సి వస్తుంది.

  • Published Feb 19, 2024 | 1:30 PMUpdated Feb 19, 2024 | 1:30 PM
PAN Card: పాన్ కార్డ్ వాడుతున్నారా? త్వరలో ఇలా  చేయకపోతే రూ.10 వేలు ఫైన్!

సాధారణంగా అందరి దగ్గర డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పాన్ , ఆధార్ ఇలా .. వారి పౌరసత్వానికి సంబందించిన అన్ని ప్రూఫ్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి వద్ద పాన్ కార్డు ఉంటుంది, ఈ కార్డు ద్వారా దేశంలోని ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ ను పూర్తి చేయవచ్చు. అలాగే, ప్రజల టాక్స్ ను నిర్ణయించడానికి.. ప్రభుత్వం ఈ పాన్ ద్వారా వచ్చే వివరాలపై ఆధారపడుతుంది. కాబట్టి గుర్తింపు కార్డులలో ఒకటైన పాన్ .. ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ, ఏ వ్యక్తి వద్ద అయినా ఈ పాన్ కార్డ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే .. వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు లేదా ఎక్కువ కార్డ్స్ ఉన్న వారు జరిమానా కట్టవలసి వస్తుందట. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సహజంగానే ఏ వ్యక్తి వద్ద అయినా ఒరిజినల్ ప్రూఫ్ కాకుండా .. అదనంగా డూప్లికేట్ ప్రూఫ్స్ ఉంటే.. ప్రభుత్వం వారికి తగిన శిక్షను విదిస్తుంది. ఈ క్రమంలో అధిక పాన్ కార్డు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే .. వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. కొన్ని సార్లు రెండు సార్లు పాన్ కార్డుకు అప్లై చేయడం వలన కానీ, లేదా మరేదైన సాంకేతిక కారణాల వలన కానీ, అవుట్ సోర్సింగ్ ప్రాసెస్ లో కానీ.. ఒక వ్యక్తికీ రెండు సార్లు పాన్ కార్డు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇలా ఎవరి వద్దనైన రెండు పాన్ కార్డ్స్ ఉన్నట్లయతే ..వారు వెంటనే ఆ ఎక్స్ట్రా కార్డును రద్దు చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికీ ప్రభుత్వం భారీ జరిమానా విదిస్తుందట.

కాగా, మరికొంతమంది ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కూడా ఇలా ఎక్స్ట్రా పాన్ కార్డును తీసుకుంటారు. ఇలాంటి వారు ఎవరైనా అధికారులకు పట్టుబడితే.. వారికి ప్రభుత్వం రూ .10,000 జరిమానా విధించనుంది. దీనిని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద ఈ జరిమానాను పరిగణించారు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వ్యక్తులు .. ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేదంటే వారు భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి