Idream media
Idream media
లోక్‌సభ ఎన్నికల తర్వాత పంచాయతీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో బదిలీల పర్వం మొదలైంది. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) నిర్ణయం తీసుకున్నారు. 33 జిల్లాలకు గాను 20 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత మొత్తంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం తొలిసారి కావడంతో చర్చనీయాంశమైంది.
ఈ బదిలీల్లో కేసీఆర్ తనయుడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మార్క్ కనిపించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని అంతా తానై నడిపించిన కేటీఆర్ రికార్డు విజయం సాధించారు. కార్పొరేషన్లను క్లీన్ స్విప్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నగరపాలక సంస్థల కమిషనర్లుగా యువ ఐఏఎస్‌లను నియమిస్తూ పాలనకు యువ రక్తాన్ని ఎక్కించారు. 2014, 2016 బ్యాచ్‌లకు చెందిన 16 మంది యువ ఐఏఎస్‌లకు తాజాగా జరిగిన బదిలీల్లో పోస్టింగ్‌లు దక్కడం గమనార్హం.