iDreamPost
android-app
ios-app

నేను అలియా భట్ కాదు

  • Published Jul 05, 2022 | 2:50 PM Updated Updated Jul 05, 2022 | 2:50 PM
  • Published Jul 05, 2022 | 2:50 PMUpdated Jul 05, 2022 | 2:50 PM
నేను అలియా భట్ కాదు

ఎక్క‌డికెళ్లినా ఈమెను ఆలియా భ‌ట్ అని అనుకొంటున్నారు. ఫోటోల కోసం వెంట‌ప‌డుతున్నారు. నేను ఆమెలా కనిపించినంత మాత్ర‌నా, డూపును కాదు. నాకంటూ సొంత వ్య‌క్తిత్వం ఉంది. దాన్ని నిల‌బెట్టుకొంటాన‌ని అంటోంది సెలెస్టి బైరాగే.

ఆమె TV ఇండ‌స్ట్రీలో నటిగా ఆడిషన్స్ కి వెళ్లిన‌ప్పుడు కూడా నువ్వు ఆలియాలా ఉన్నావ‌ని అంటుంటే.. కెరీర్ ఎమైపోతుందేమోన‌న్న టెన్ష‌న్ వ‌చ్చింది.

మ‌న‌లాగే ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటార‌ని అంటారు. మిన‌మిక్క‌డ‌. మిగిలిన ఆరుగురు ఎక్క‌డున్నారో తెలియ‌దు. కాని సెల‌బ్రిట్రీల రూపురేఖ‌లుంటే చాలు, వాళ్ల‌ను స్టార్ల పేర్ల‌తోనే పిలుస్తారు. అంతెందుకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల్లాగా ఉండేవాళ్లు ప‌దుల్లో ఉన్నారు. వాళ్లుకూడా లోక‌ల్ సెల‌బ్రిటీలే.


బ్రహ్మాస్త్ర నటి అలియా భట్ కూడా అచ్చం అలాంటి పోలిక‌ల‌తో ఉన్న అమ్మాయి ఉంది పేరు Celesti Bairagey . ఆమె న‌వ్వితే అచ్చం అలియానే. ఆమె లుక్స్ తో స్టార్ తో పోలుస్తారు. ఇది సెలిస్టీకి న‌చ్చ‌లేదు. తానుకూడా సొంత బ్రాండ్ తో ఎద‌గాల‌నుకొంటోంది. అందుకే హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం చేసిన వీడియోలో, తన స్వంత గుర్తింపును ఎలా తీర్చిదిద్దుకోవాల‌నుకొందో మాట్లాడింది.

View this post on Instagram

A post shared by Rabbani Soyam (@rabbanisoyam)


అలియా ఇప్పుడు మొదటి హాలీవుడ్ వెంచర్ షూటింగ్ కోసం లండన్‌లో ఉంది. ఆమె వండ‌ర్ ఉమెన్ స్టార్ గాల్ గాడోట్‌తో కలిసి నటించబోతోంది. అంతే కాదు, కిట్టిలో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. లేటెస్ట్ గా, అలియా భట్ తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా లో వెల్లడించింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş