iDreamPost
iDreamPost
వారం రోజులుగా వర్షాలతో నగర జీవనం కొంతవరకు స్తంభించిపోయింది. అవసరమైతే తప్ప, ఎవరూ బైటకు రావడంలేదు. ఈరోజు రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో, మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈదురు గాలులు కొనసాగుతాయని, చెట్లు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలతో పాటు అధికారులుకూడా, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రజలు ఎమర్జెన్సీ అయితేనే రోడ్లమీదకు రావాలని, వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలన్నది జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి. చెట్ల కింద ఉండొద్దు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎమెర్జెన్సీకోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే 040-29555500కి కాల్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.