iDreamPost
మూసానగర్, కమలా నగర్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు అంబర్ పేట్, మలక్ పేట చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మందిని రత్నా నగర్, పటేల్ నగర్, గోల్నాకల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
మూసానగర్, కమలా నగర్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు అంబర్ పేట్, మలక్ పేట చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మందిని రత్నా నగర్, పటేల్ నగర్, గోల్నాకల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
iDreamPost
భారీ వర్షాల కారణంగా జంట రిజర్వాయర్ల నుంచి మూసీలోకి వరద నీరు పోటెత్తుతుండడంతో మూసారాం బాగ్, చాదర్ ఘాట్ వంతెనలను మూసివేశారు. పోలీసులు వంతెనల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో
వెళ్ళాలని వాహనదారులకు సూచిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. మూసారాం బాగ్ వంతెన మూసేయడంతో మలక్ పేట్ అంబర్ పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు అంబర్ పేట్ కొత్త బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఒక్కసారిగా అందరూ అటువైపే వెళ్తుండడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇతర మార్గాలు కూడా వాహనాలతో క్రిక్కిరిసిపోతున్నాయి.
కుండపోత వానల వల్ల నీటి మట్టాలు పెరుగుతుండడంతో అధికారులు హిమాయత్ సాగర్ ఎనిమిది గేట్లను నాలుగడుగుల వరకు, ఉస్మాన్ సాగర్ 12 గేట్లను ఆరడుగుల వరకు ఎత్తివేశారు. దీంతో మూసారాం బాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసానగర్, కమలా నగర్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు అంబర్ పేట్, మలక్ పేట చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మందిని రత్నా నగర్, పటేల్ నగర్, గోల్నాకల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. GHMC సిబ్బంది వరద భాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.