iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రజలకు ఊరట.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన!

రాష్ట్ర ప్రజలకు ఊరట.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. భారీ వానాల ధాటికి పలు రెండు తెలుగు స్టేట్స్  లోని పలు జిల్లాలు చిగురుటాకుల వణికిపోయాయి. లోతట్టు ప్రాంతాల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భారీ వానలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. తిండి, నీరు, కరెంట్ వంటి సమస్యలతో నరకం చూశారు.  అసలు వరుణ దేవుడు ఎప్పుడు విరామం తీసుకుంటాడా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని తెలిపింది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే పరిస్థితులు లేవని అంచనా వేసింది.

అత్యంత భారీ వర్షాలు, వరద ఉద్ధృతితో హైదరాబాద్ తో సహా ఉత్తర తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతంలో ఎన్నడు పడని స్థాయిలో భారీ వర్షం తెలంగాణపై విజృంభించింది. ఇక  ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీనంగర్ జిల్లాల్లోని  పలు గ్రామాలు అయితే మునిగిపోయి.. నదులను తలపించాయి. ఇంకా అనేక గ్రామాల్లోకి వరద నీరు చేరి.. తాగడానికి నీరు లేక, ఆహారం లేక, విషసర్పాల సంచారంతో భయం భయంగా గడిపారు. ఎప్పుడు ఈ వాన దేవుడు శాంతిస్తాడా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అత్యంత భారీ వర్షాలు, వరద ఉధృతితో ఇబ్బంది పడ్డ.. తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. వర్షాల గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇక భారీ వర్షాలు తగ్గినట్లేనని స్పష్టం చేసింది.  మరో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని అంచనా వేసింది. అయితే ప్రజలు భయపడేలా అతి భారీ వర్షాలు ఇప్పట్లే పడే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. కుంభవృష్టి వర్షాలతో నరకం అనుభవించిన ప్రజలకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం బలహీన పడిందని, ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలు పడే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: GHMC వార్నింగ్..అలా చేస్తే లక్ష రూపాయల జరిమానా!