iDreamPost
android-app
ios-app

వీడియో: హెడ్ కానిస్టేబుల్ కి ఘన స్వాగతం పలికిన భర్త!

వీడియో: హెడ్ కానిస్టేబుల్ కి  ఘన స్వాగతం పలికిన భర్త!

నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. చాలా మంది మహిళలు తాము ఎంచుకున్న రంగంలో  కృషి చేసి విజయం సాధిస్తున్నారు. అయితే ఇలా విజయం సాధిస్తున్న కొందరి మహిళల వెనుక పురుషుడి సహకారం ప్రోత్సాహం ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో ఘటనలు మనం చూశాం.అలానే  కొందరు భర్తలు.. తమ భార్య ఏదైన విజయం సాధిస్తే..సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటారు. తాజాగా మహిళ పోలీసులకు హెడ్ కానిస్టేబుల్ గా  ప్రమోషన్  తీసుకుని ఇంటి వస్తే.. భర్త ఎలా స్వాగతం పలికాడో చూస్తే.. ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం వారి వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతంలో కంపాడీనా అనే మహిళా పోలీస్ నివాసం ఉంటుంది. ఆమె ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది.  డీనాకు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది.  ఈ నేపథ్యంలో 45 రోజుల శిక్షణ నిమిత్తం కరీంనగర్ వెళ్లింది. ఇటీవలే ఆమె ట్రైనింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.  దీంతో డీనాకు… ఆమె భర్త సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఇంటికి చేరుకునేసరికి బ్యాండు మేళాలతో కుటుంబ సభ్యులు  ఘన స్వాగతం పలికారు. టపాకాయలు  కాల్చుతూ, తీన్మార్ డ్యాన్స్లు చేస్తూ తెగ సందడి చేశారు. అంతేకాక కేక్ కట్ చేయించి, ఆమెకు పూల వేసి బ్యాండ్ మేళంతో హోరెత్తించారు.

భర్త చేసిన ఈ పనికి  డీనా కళ్లల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ ఇల్లంతా సందడిగా మారిపోయింది. చిన్న చిన్న ప్రశంసలు ఇస్తేనే సంతోష పడిపోయే భార్యలుంటారు. ఇలా గ్రాండ్ వెలకమ్ చెప్పిన భర్త… లవ్ కి ఆమె ఫిదా అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ మహిళ కానిస్టేబుల్ భర్తపై.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సర్ప్రైజ్‌లు బంధాలు మరింత స్ట్రాంగ్ చేస్తాయనడంలో అసలు సందేహం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈవీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Deccan Chronicle (@deccanchronicle_official)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş