Swetha
నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలి అంటూ.. పెద్దలు దీవిస్తూ ఉంటారు. అయితే ఇస్రోకు చెందిన ఓ సైంటిస్ట్ మాత్రం .. రానున్న రోజుల్లో ఒక మనిషి జీవితంలో వంద ఏళ్లకు మించి అంటే.. 200నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని చెప్తున్నారు.
నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలి అంటూ.. పెద్దలు దీవిస్తూ ఉంటారు. అయితే ఇస్రోకు చెందిన ఓ సైంటిస్ట్ మాత్రం .. రానున్న రోజుల్లో ఒక మనిషి జీవితంలో వంద ఏళ్లకు మించి అంటే.. 200నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని చెప్తున్నారు.
Swetha
ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు పట్టుమని పాతిక నుంచి యాభై ఏళ్ళు బ్రతికినా చాలు అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో చెప్పలేని పరిస్థితులను నేడు చూస్తూనే ఉన్నాము. అడపా దడపా యవ్వన వయస్కులు సైతం హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తున్నారని వార్తలు వింటూనే ఉన్నాము. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రెండు వందల నుంచి మూడు వందల ఏళ్ల వరకు జీవించడం సాధ్యమేనా అంటే.. అవును అనే అంటున్నారు ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఒక మనిషి వంద ఏళ్ళు లేదా ఆ పై కొన్ని సంవత్సరాలు జీవించడం సాధ్యమే. మనం కూడా అప్పుడప్పుడు సామజిక మాధ్యమాలలో.. 100 ఇయర్ బర్త్ డేస్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే.. కొంత మంది వృద్ధులను చూస్తూనే ఉంటాం. ఇక వంద ఏళ్లకు మించి కూడా మనుషులు బ్రతికారు. కానీ అది ఇప్పుడున్న కలియుగంలో కాదు. ఎపుడో రామాయణ , మహాభారత కాలం నాటి యుగంలో.. మనుషులు దాదాపు రెండు వందల సంవత్సరాలు జీవించేవారు. అప్పటి కాలంలో మానవుల మనుగడ, ఆయుః కాలం ఇప్పటికంటే కూడా చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. వారు తీసుకునే ఆహారం, జీవన విధానం.. వారు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడేలా ఉండేది. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధం జరిగినపుడు పాండవులు, కౌరవుల వయస్సు.. సుమారు అరవై నుంచి డెబ్భై సంవత్సరాల మధ్యన ఉండేదట. ఆ యుద్ధం తర్వాత కూడా వారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే రాజ్యాన్ని పరిపాలించారట.
మరి ఇప్పటి కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానం అంతా మారిపోయినా కూడా.. ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఉందంటున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. ప్రస్తుతం సగటు మనిషి జీవన ఆయుష్షు డెబ్భై సంవత్సరాలకు కుదించారు. కానీ, అనేక కారణాల వలన ఈలోపే కొంతమంది ఊపిరిలు వదులుతున్నారు. ఎక్కడో కొంతమంది ఆ మార్క్ ను క్రాస్ చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్న మనకు ఒకేసారి రెండు వందల నుంచి మూడు వందల వరకు.. జీవించే అవకాశం వస్తే ఎవరు కాదనగలరు. అది ఎలా సాధ్యపడుతుందో ఎస్ సోమనాథ్ తాజగా జేఎన్‌టీయూ హైదరాబాద్ లో జరిగిన 12వ స్నాతకోత్సవంలో తెలియజేశారు.
ఎలా అంటే.. మనిషి శరీరంలో పాడైపోయిన అవయవాలను, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను.. మార్చడం ద్వారా 200 నుంచి 300 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ప్రయోగాలను చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. దీనిపై స్టడీ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఈ ఏడాది పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలను కక్ష్యలోకి పంపుతున్నట్టు పేర్కొన్నారు. మానవులను అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్ మిషన్’ను ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతను ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి, అన్ని విజయాలు మాత్రమే చూశాను అనుకుంటే పొరపాటేనని.. ఆయన కూడా జీవితంలో కష్టాలను రుచి చూసి వచ్చారని పేర్కొన్నారు. ఏదేమైనా, రాబోయే రోజుల్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు జీవించే రోజులు వస్తాయో లేదో వేచి చూడాలి. మరి, ఇస్రో చైర్మన్ తెలియజేసిన ఈవార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.