Instagram Story మ్యూజిక్ తో ఇన్‌స్టా గ్రామ్ స్టోరీస్ డౌన్ లోడ్ చేయడమెలా? ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

ఇన్‌స్టా గ్రామ్! (Instagram)! ఫొటో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం(photo sharing social media platform). ఇందులో స్టోరీస్, రీల్స్ (stories, reels) లాంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లే ఉంటాయి. అయితే స్టోరీస్, రీల్స్ డౌన్ లోడ్ (download) చేసుకోవాలంటే కొంత ఇబ్బందే! దీనికీ ఓ మార్గముంది. దీని ద్వారా స్టోరీస్, రీల్స్ డౌన్ లోడ్ చేసి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా మీక్కావల్సిన వాళ్ళకు పంపుకోవచ్చు. లేదా మీరే ఆఫ్ లైన్ లో చూసుకోవచ్చు. మరి Instagram నుంచి ఒక స్టోరీని music తో పాటు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?

1.ఇన్‌స్టా గ్రామ్ లో స్టోరీస్ 24 గంటల తర్వాత మాయమైపోతాయి. ఆలోపే వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ స్టోరీనే డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఆ స్టోరీని ఓపెన్ చేసి కుడివైపు పై భాగంలో నిలువుగా ఉన్న 3 చుక్కలపై (dots) క్లిక్ చేయండి. సేవ్ (Save) అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ స్టోరీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.

2. వేరే వాళ్ళ స్టోరీని డౌన్ లోడ్ చేసుకోవాలంటే గూగూల్ ప్లే స్టోర్ (google play store)లోకి వెళ్ళిఇన్‌స్టా గ్రామ్ స్టోరీ డౌన్ లోడర్ యాప్ (Instagram Story Downloader App )డౌన్ లోడ్ చేసుకోవాలి.

3.ఆ తర్వాత ఇన్‌స్టా గ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీరు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్న స్టోరీ పోస్ట్ చేసిన వారి ప్రొఫైల్ (profile) లోకి వెళ్ళండి. అందులో నుంచి యూజర్ నేమ్ (user name) కాపీ చేయండి.

4.ఇప్పుడు ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ డౌన్ లోడర్ యాప్ ఓపెన్ చేసి కాపీ చేసిన యూజర్ నేమ్ అక్కడ పేస్ట్ (paste) చేయండి. తర్వాత సెర్చ్ (search) మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ (scroll down) చేస్తూ మీకు కావల్సిన స్టోరీ రాగానే డౌన్ లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతే! ఆ స్టోరీ మీ ఫోన్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. దీన్ని ఎవరికి కావాలంటే వాళ్ళకు పంపుకోవచ్చు లేదా ఫేస్ బుక్ లాంటి వేరే ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ (upload) చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ (screenshots) తరహాలోనే తమ స్టోరీ డౌన్ లోడ్ అయిన విషయం ఆ యూజర్లకు తెలిసే అవకాశం ఉండదు.

Show comments