iDreamPost
iDreamPost
బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమికొట్టారు. మారణాయుధాలతో వీధుల్లో తిరిగారు. నినాదాలు చేశారు. కనిపించినవాళ్లను భయభ్రాంతులకు గురిచేశారు. శుక్రవారం రాత్రి మాచర్లలో కెమెరాలకు చిక్కిన టీడీపీ గూండాల రాక్షస ప్రవర్తన.
ముందే రాడ్లు, కర్రలు తెచ్చుకున్నారు. దాడులకు రెడీ అయ్యారు. విలేకరుల సమావేశమన్నారు. అడ్డుకున్నారంటూ ఏసంబంధమూ లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కొట్టారు. అక్కడ నుంచి పెట్రేగిపోయారు.
టీడీపీ కొద్దిరోజులుగా అదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా… అనుకున్నంత మేర జన స్పందన లేదు. ఫెయిల్ అయ్యింది. దీన్ని కవర్ చేయడానికి ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరిన మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డీ శుక్రవారం విలేఖరుల సమావేశాన్ని ఎర్పాటు చేశారు.
రెండురోజుల క్రితం తప్పతాగి రోడ్లమీద గొడవ చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడిన బ్రహ్మారెడ్డి, నా అనుచరులను అరెస్ట్ చేస్తారా? అంటూ కొంతమందితో కలసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ మీదే దాడికి దిగారు. చుట్టుప్రక్కల నుంచి తన అనుచరులను ముందుగానే మాచర్లకు పిలిపించారు.
విలేకరుల సమావేశం పెట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, సీఎం జగన్ మీద నోరుపారేసుకున్నారు. దీంతో అక్కడున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు వాళ్లను నిలదీయడంతో…. మమ్మల్ని అడ్డుకొంటారా అంటూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు చల్లా మోహన్, కిషోర్, ఉప్పుతోళ్ల శ్రీనివాసరావులపై దాడలు చేశారు. వాళ్లను వదలకుండా కొడుతూనే ఉన్నారు. బండరాళ్లతో గుండెల కొట్టారు. తమకు ఎదురులేదంటూ నినాదాలు చేస్తూ, ఈలల వేసుకొంటూ ప్రదర్శనగా రైలుగేటు వరకు వెళ్లారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. ఒక దశలో పోలీసులమీద దౌర్జన్యానికి దిగారు. అదేసమయంలో కొందరు రైల్వే గేటు వద్ద ఓ వాహనాన్ని దహనం చేశారు. మరో నాలుగు బైక్ లను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు బ్రహ్మారెడ్డిని బలవంతంగా గుంటూరుకు పంపించారు.
మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు, అతని కొడుకేనని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటున్నారు. ప్లాన్ ప్రకారమే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ ప్లాన్ ప్రకారం దాడికి దిగిందని, ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డితో బాబు కుట్రలు చేయిస్తున్నాడని ఆరోపించారు.
అసలు ర్యాలీలో కర్రలు, రాడ్లు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించిన ఎమ్మెల్యే, బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారని చెప్పారు.
మొత్తం గొడవపై పల్నాడు ఎస్సీ రవిశంకర్ స్పందించారు. భారీగా బలగాలను మోహరించి, గొడవలకు కారణమైన వాళ్లను పట్టుకొంటామని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉన్నాయి. ఉద్రక్తితలకు కారణం ప్యాక్షనిస్టులేనని, రాజకీయ పార్టీల అండతో గొడవలు చేశారని తేల్చిచెప్పారు. విధ్వంసానికి కారణం టీడీదపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలేనని చెప్పారు. చుట్టుప్రక్కల నియోజకవర్గాల నుంచి మాచర్లకు రావాలని టీడీపీ నేతలు కొందరు పిలుపునిచ్చారన్న సమాచారం నేపథ్యంలో, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.