iDreamPost
android-app
ios-app

భార్యంటే ఎంత ప్రేమ.. ఆమె కోసం ఒంటి కాలి మీద ఏకంగా 120 కిమీ

  • Published Nov 05, 2023 | 2:36 PM Updated Updated Nov 05, 2023 | 2:36 PM

జీవితాంతం కష్ట సుఖాల్లోనూ తోడు నీడగా ఉంటానని మాట ఇస్తుంటాడు భర్త. కానీ ఆచరణలో చూసే సరికి.. భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటాడు. భార్యలను సరిగా అర్థం చేసుకోని భర్తలున్న ఈ సమాజంలో.. ఇతగాడు నిజంగానే ఆదర్శపురుషుడు.

జీవితాంతం కష్ట సుఖాల్లోనూ తోడు నీడగా ఉంటానని మాట ఇస్తుంటాడు భర్త. కానీ ఆచరణలో చూసే సరికి.. భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటాడు. భార్యలను సరిగా అర్థం చేసుకోని భర్తలున్న ఈ సమాజంలో.. ఇతగాడు నిజంగానే ఆదర్శపురుషుడు.

  • Published Nov 05, 2023 | 2:36 PMUpdated Nov 05, 2023 | 2:36 PM
భార్యంటే ఎంత ప్రేమ.. ఆమె కోసం ఒంటి కాలి మీద ఏకంగా 120 కిమీ

అన్ని బంధాల్లో కెల్లా గొప్పది భార్య భర్తల మధ్య ఉండే బంధం. దంపతులుగా ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా.. తాళికట్టిన మగడికి చిన్నదెబ్బ తగిలినా విలవిలలాడిపోతుంది ఇంతి. గిల్లికజ్జాలు, గొడవలు లేని సంసారం, కాపురం ఉండదు కనుక.. భర్త బాగా చూసుకుంటే వాటిని పక్కన పెట్టేసి..పతి సేవలో తరిస్తూ ఉంటుంది. భర్త ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని పూజలు చేస్తుంది భార్య. తన సంసారం పచ్చగా ఉండాలని, తాను సుమంగళిగా బతకాలని మొక్కుకుంటూ ఉంటుంది. పతియే పక్షగా దైవంగా కొలుస్తూ ఉంటుంది. భార్య మాత్రమే ప్రేమించే భర్తలే కాదూ.. సతిని ప్రేమించే భర్తలు కూడా ఉన్నారు ఈ లోకంలో.

భార్య భర్తల బంధానికి నిలువెత్తు నిదర్శనం ఈ దంపతులు. కాళ్లు, చేతులు సరిగా ఉంటేనే.. భార్యను పట్టించుకోకుండా.. హింసిస్తున్న భర్తలు ఉన్న ఈ రోజుల్లో భార్య ఆరోగ్యం కోసం మొక్కుకుని, ఒక్క కాలితోనే ఆ మొక్కును తీర్చుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండల తిరుణం పాలెం గ్రామానికి చెందిన కుప్పల స్వామి, సత్యవతి భార్య భర్తలు. కుప్పల స్వామికి ఓ యాక్సిడెంట్‌లో కాలు పోయింది. అయితే అతడి భార్య అనారోగ్యం బారిన పడింది. ఆమె ఆరోగ్యం బాగుపడాలని అంతర్వేదీలో కొలువైన ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి మొక్కుకున్నాడు.

భార్య ఆరోగ్యం మెరుగుపడటంతో మొక్కు తీర్చుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఒంటికాలిపై 120 కిలోమీటర్లదూరంలో ఉన్న అంతర్వేదికి పయనమయ్యారు. ఆ ఇంటి నుండి గుడికి వెళ్లేందుకు 16 రోజుల సమయం పట్టింది. నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాడు కుప్పల స్వామి. ఆమె అనారోగ్యం బారిన పడటంతో మొక్కుకున్నానని, ఆరోగ్యం కుదుట పడటంతో మొక్కు చెల్లించుకుంటున్నట్లు చెప్పారు. భార్యపై అతనికి ఉన్న ప్రేమ వెలకట్టలేనిది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet