iDreamPost
iDreamPost
ఇటీవలే ఓటీటీలో టెలికాస్ట్ అయిన తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ పూర్తయింది. ఈ సారి అందరూ మొదటి నుంచి అనుకుంటున్నట్టే బిందు మాధవి విన్నర్ గా నిలిచి తెలుగులో మొదటి మహిళా బిగ్‌బాస్ విన్నర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే విన్నర్ బిందు మాధవి బిగ్‌బాస్ గెలవడంతో ఎంత సంపాదించింది? హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అని అంతా చర్చించుకుంటున్నారు.
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా నిలిచిన బిందుమాధవి షోలో విజేతగా గెలవడంతో 40 లక్షల రూపాయలు సాధించింది. విన్నర్ కి ప్రైజ్‌మనీ 50 లక్షల రూపాయలు. కాని గ్రాండ్ ఫినాలేలో ఒకరిని తప్పించడానికి 10 లక్షలు ఆఫర్ చేయడంతో అరియానా గ్లోరీ ఆ 10 లక్షలు తీసుకుని ఫినాలే రేసు నుంచి తప్పుకోవడంతో విన్నర్ కి 40 లక్షల రూపాయలు మిగిలాయి, ఆ 40 లక్షల రూపాయలు బిందు మాధవి తీసుకుంది.
ఇక హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్ కూడా ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ రెమ్యునరేషన్ వారం రోజుల చొప్పున మాట్లాడి ఇస్తారు. బిందు మాధవికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో పాల్గొనడానికి వారానికి 5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా బిందు బిగ్‌బాస్ లో 12 వారాలు ఉంది. దీంతో బిందుకి దాదాపు 60 లక్షలురూపాయలు రెమ్యునరేషన్ పరంగా వచ్చాయి. గెలిచిన డబ్బుతో కలిపి దాదాపు కోటి రూపాయలు సంపాదించింది బిందు మాధవి. ఇక ట్యాక్సులు పోను దాదాపు 70 లక్షలు చేతికి వస్తాయి.
మొత్తానికి చాలా రోజుల తర్వాత బిందు మాధవి బాగానే సంపాదించింది. ఈ షోతో పేరు కూడా సంపాదించి మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పటికే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిందు మాధవి, మరిన్ని ఛాన్సులు వచ్చి గతంలో లాగా బిజీ అవుతుందని ఆశిస్తుంది.