iDreamPost
iDreamPost
నిన్న మొత్తం మూడు తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు పండగ కానుకలుగా వచ్చాయి. అందులో మొదటిది పెద్దన్న. రజినీకాంత్ హీరోగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను నిరాశపరుస్తోంది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదని ట్రేడ్ రిపోర్ట్. సుమారు 1 కోటి 60 లక్షల షేర్ తెలుగు రాష్ట్రాల నుంచి నమోదైనట్టుగా తెలిసింది. ఇది చాలా తక్కువ మొత్తం. నైజాంలో చూసుకుంటే దర్బార్ కి ఫస్ట్ డే 2 కోట్ల షేర్ రాగా డిజాస్టర్ కాలా 1 కోటి 16 లక్షలు రాబట్టింది. కానీ పెద్దన్న మాత్రం కేవలం 43 లక్షలకే పరిమితం కావడం అంతు చిక్కడం లేదు. మొత్తం గ్రాస్ రెండున్నర కోట్లను కూడా టచ్ చేయలేకపోయింది.
ఇక అవకాశం వాడుకుందామని శతవిధాలా ప్రయత్నించిన మంచి రోజులు వచ్చాయికి సైతం మేజిక్ జరగలేదు. కేవలం 86 లక్షల షేర్ కి పరిమితం కావాల్సి వచ్చిందని ట్రేడ్ సమాచారం. సుమారు 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు ఇప్పుడు టార్గెట్ కొండలా మారిపోయింది. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ మారుతీ మూవీకి ఆ ఛాన్స్ తక్కువే. ఒకవేళ యావరేజ్ గా ఉన్నా పర్లేదు చూద్దామని ప్రేక్షకులు డిసైడ్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం చాలా కష్టం. దీని కన్నా విశాల్ ఎనిమికి చాలా మెరుగ్గా 1 కోటి దాకా రావడం అసలు ట్విస్ట్. ఇదీ టాక్ కు ఎదురీదాల్సి ఉంటుంది.
మొత్తంగా మూడు కలిసి మూడున్నర కోట్లు కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. అయితే నిన్న ఎంత పండగ అయినా ఫ్యామిలీలు అధిక శాతం సాయంత్రం పూట టపాసులు కాల్చడంలో బిజీగా ఉన్నాయి. సహజంగానే సినిమాకు వెళ్లే మూడ్ కానీ టైం కానీ ఉండదు. దాని వల్ల ఫస్ట్ షో, సెకండ్ షోల మీద ఎఫెక్ట్ పడింది. ఇవాళ నుంచి మూడు రోజులు వీకెండ్ వస్తుంది కాబట్టి దాన్నెలా ఉపయోగించుకుంటాయో చూడాలి. లేదంటే సోమవారం నుంచి సహజంగా ఉండే డ్రాప్ తో ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఈ మూడు సినిమాలు తమ రిటర్న్స్ ని ఏ మేరకు సురక్షితంగా వెనక్కు రాబట్టుకుంటాయో వేచి చూడాలి
Also Read : Balayya Unstoppable : నిజంగానే ఇద్దరు స్టార్లు ఓపెన్ అయ్యారా