Swetha
ప్రస్తుతం అందరికి సమయం చాలా అత్యవసరం. కనుక బ్యాంకులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు.. ఆరోజు సెలవు ఉందా! లేదా ! అనే విషయాలను తెలుసుకుని.. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.
ప్రస్తుతం అందరికి సమయం చాలా అత్యవసరం. కనుక బ్యాంకులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు.. ఆరోజు సెలవు ఉందా! లేదా ! అనే విషయాలను తెలుసుకుని.. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.
Swetha
గతంలో డబ్బులు డ్రా చేయాలి అంటే బ్యాంక్ లు వద్ద క్యూలు కట్టేవారు. మారుతున్న కాలంతో పాటు.. మారుతున్న టెక్నాలజీ కారణంగా ప్రజలకు ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అందరూ ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఏ వినియోగిస్తున్నారు. దీనివలన సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ, ఎంత ఆన్ లైన్ వినియోగదారీతనం ఎక్కువైనా.. ఎదో ఒక పని మీద ఎప్పుడో ఒకప్పుడు బ్యాంక్ కు వెళ్లడం తప్పనిసరి. అయితే, ఏ రోజున బ్యాంక్ కు సెలవులు ఉంటాయో.. ఏ రోజున బ్యాంక్ తెరచి ఉంటుందో అనే సందేహం అందరికి ఉంటుంది. దాని ప్రకారంగా వారు ప్రణాళికలను సిద్ధం చేసుకోడానికి వీలుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి నెలలో బ్యాంక్ లకు సెలవలు ఈ విధంగా ఉన్నాయి.
అరచేతిలో అంతర్జాలం వచ్చిన దగ్గరనుంచి.. ప్రస్తుతం ప్రజలు దేనికి లోటు లేకుండా గడిపేస్తున్నారు. నిత్యావసరాల దగ్గరనుంచి తినే ఆహరం వరకు అన్ని ఆన్ లైన్ లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వీటితో పాటు డబ్బులు కూడా ఆన్ లైన్ లోనే చెల్లించడం ప్రారంభించారు. దీని వలన వినియోగదారులకు కాస్త సమయం కూడా కలిసివస్తుంది. కానీ, అప్పుడపుడు బ్యాంకులకు కూడా వెళ్ళవలసి రావడంతో.. బ్యాంకు పనివేళలు ఎప్పుడెప్పుడా ఉంటాయో తెలియకపోవడంతో.. ప్రజలు కొన్ని సార్లు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఈ క్రమంలో రాబోయే నెలలో బ్యాంకు సెలవలు ఈ విధంగా ఉన్నాయి. రెండు రోజుల్లో 2024 ఫిబ్రవరి నెల ప్రారంభం కానుండడంతో.. వచ్చే నెలలో అన్ని బ్యాంకులకు రెండవ శనివారం, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో కలిపి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 4 – ఆదివారం, 10- రెండవ శనివారం, 11-ఆదివారం, 14- వసంత పంచమి, సరస్వతి పూజ, 15- లుయి గాయి నీ (ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు), 18- ఆదివారం, 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్ ప్రాంతాలలో సెలవు), 20- రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగరాల్లో బ్యాంకులు మూసివేత. 24- నాలుగవ శనివారం, 25- ఆదివారం, 26- న్యోకూమ్ (ఇటా నగరంలో బ్యాంకులకు సెలవు).
కాబట్టి, వారి వారి అవసరాలను బట్టి బ్యాంకులకు వెళ్లదలిచిన వారు.. ఈ ప్రకారంగా వారి ప్రణాలికను సిద్ధం చేసుకుంటే.. వారికీ కాస్త సమయం కలిసి వస్తుంది. ఏదేమైనా నిత్యం మనం అరచేతుల్లోనుంచే లావాదేవీలను చేస్తున్నా సరే.. బ్యాంకుల వద్దకు వెళ్లకుండా మాత్రం ఏ పనులు జరగవని చెప్పి తీరాలి. మరి రాబోయే నెలలో బ్యాంకు సేవలను బట్టి.. ఎవరి పనులను వారు పూర్తి చేసుకోవడం కోసం.. తెలిపిన వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.