iDreamPost
android-app
ios-app

ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన పిండం.. ఒకేసారి రెండు OTTల్లోకి

  • Published Feb 02, 2024 | 3:11 PM Updated Updated Feb 02, 2024 | 3:11 PM

Pindam OTT Streaming: హరర్‌ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు శుభవార్త.. పిండం సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆ వివరాలు..

Pindam OTT Streaming: హరర్‌ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు శుభవార్త.. పిండం సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆ వివరాలు..

  • Published Feb 02, 2024 | 3:11 PMUpdated Feb 02, 2024 | 3:11 PM
ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన పిండం.. ఒకేసారి రెండు OTTల్లోకి

ఆ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రం మసూద. చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ కూడా ఉంటుందని ప్రకటించారు. ఇక మసూద తర్వాత ఇటీవలి కాలంలో ఓ సినిమా అదే స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టింది. అదే పిండం సినిమా. గత ఏడాది థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. అయితే ఆశించిన మేర విజయం సాధించలేదు. చాలా పూర్‌ కలెక్షన్స్‌ సాధించింది. సినిమాలో చాలా అనుభవం ఉన్న నటీనటులే నటించినా.. పెద్దగా సక్సెస్‌ కాలేదు.

సినిమా పేరుకు తగ్గట్లే కథ కూడా విభిన్నంగా ఉంటుంది. హీరో శ్రీరామ్‌, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం నిరాశపరిచింది. ఇలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆ వివరాలు..

గత ఏడాది, డిసెంబర్‌ 15న థియేటర్స్‌లో విడుదలైన పిండం సినిమా.. నెలన్నర తర్వాత.. ఓటీటీలోకి వచ్చేసింది. ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌లో ఫిబ్రవరి 1 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సడెన్‌గా వచ్చేసి.. ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చింది. ఇక హరర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారే.. ఈ వీకెండ్‌లో పిండం సినిమాను చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

పిండం చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, ఈశ్వరి రావు, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించగా యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మించాడు. మూవీ విషయానికి వస్తే.. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. కామెడీ, హీరోయిజం లాంటి అంశాల‌తో మిక్స్ చేయ‌కుండా దీన్ని పూర్తి హార‌ర్ చిత్రంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్‌. క‌థ రొటీన్ అయినా.. సౌండ్స్‌, హార‌ర్ ఎలిమెంట్స్‌తో భ‌య‌పెట్టాడు. మరి ఈ హారర్‌ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఓటీటీలో చూసేయండి. ఇక ఈ వీకెండ్‌ ఒక్కరోజే ఓటీటీల్లో 9 సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిల్లో లావణ్య త్రిపాఠి నటించిన మిస్‌ ఫర్‌ఫెక్ట్‌, వెంకటేష్‌ సైంధవ్‌ సినిమాలు కూడా ఉన్నాయి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş