iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో పరువు హత్య.. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు..

  • Published May 05, 2022 | 1:32 PM Updated Updated May 05, 2022 | 1:33 PM
హైదరాబాద్‌లో పరువు హత్య.. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు..

తమ కూతురు వేరే మతాంతర వివాహం చేసుకుందని ఆ యువకుడిని వెంటాడి చంపిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అక్కడే దగ్గర్లో ఉన్న ఘనాపూర్‌కి చెందిన ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి బయటకి వచ్చి పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నారు. ఇది జరిగి రెండు నెలలు కాగా హైదరాబాద్ లోని ఓ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తూ బతుకు తెరువు కొనసాగిస్తున్నాడు నాగరాజు. అయితే నాగరాజుపై ఆ యువతి సోదరుడు పగ పెంచుకొని రెక్కీ నిర్వహించి మరీ ప్రస్తుతం వాళ్ళు ఉండే ప్రాంతాన్ని కనుక్కొని సమయం చూసి నాగరాజు, ఆశ్రీన్ బండి మీద వెళ్తుండగా వెనక నుంచి వచ్చి ఇనపరాడ్ తో దాడి చేసి చంపేశారు. దీంతో ఈ పరువు హత్య హైదరాబాద్ లో కలకలం సృష్టించింది.

మృతుడు నాగరాజు భార్య అశ్రీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి బండి మీద బంధువుల ఇంటికి వెళ్తుండగా నా భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారు. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కింద పడేశారు. రోడ్డు మీదే నా భర్తని ఇనుపరాడ్‌తో కొట్టి చంపారు. నాగరాజును చంపొద్దు అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, నా భర్త మీద పడ్డాను అయినా నన్ను నెట్టేసి నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టి చంపారు. నేను, నాగరాజు పదేళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నాగరాజు నన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటున్నాడు. నాకు న్యాయం చేయాలి అని వెక్కి వెక్కి ఏడ్చింది.

నాగరాజు తల్లి తండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మా కొడుకు చేసిన తప్పా? నిన్న రాత్రి తొమ్మిది గంటలకు అమ్మాయి ఫోన్ చేసి మా అన్న మీ కొడుకును చంపేసాడని చెప్పింది. గతంలో వికారాబాద్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసాం. నా కొడుకు తక్కువ కులం వాడని చంపేశారు. మాకు న్యాయం కావాలి. మా కొడుకుని చంపిన ఆశ్రీన్ అన్నని ఉరి తీయాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. గతంలో కూడా చాలా సార్లు బెదిరించారు. వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంటే చంపేశారు అని కన్నీళ్లు పెట్టారు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş