iDreamPost
android-app
ios-app

ఇకపై ఎయిడ్స్ రాకుండా అడ్డుకోవచ్చు.. HIV కి వ్యాక్సిన్ వచ్చేసింది

  • Published Sep 22, 2024 | 1:01 PM Updated Updated Sep 22, 2024 | 1:01 PM

HIV New Vaccine : ప్రపంచ దేశాలను ఎప్పటినుంచో వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్ . కొన్ని ఏళ్లుగా ఈ వ్యాధికి చెక్ పెట్టాలని ఎంతో మంది శాస్త్రవేత్తలు శ్రమ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్లకు దానికి వ్యాక్సిన్ ను కనిపెట్టారు . దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

HIV New Vaccine : ప్రపంచ దేశాలను ఎప్పటినుంచో వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్ . కొన్ని ఏళ్లుగా ఈ వ్యాధికి చెక్ పెట్టాలని ఎంతో మంది శాస్త్రవేత్తలు శ్రమ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్లకు దానికి వ్యాక్సిన్ ను కనిపెట్టారు . దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 22, 2024 | 1:01 PMUpdated Sep 22, 2024 | 1:01 PM
ఇకపై ఎయిడ్స్ రాకుండా అడ్డుకోవచ్చు.. HIV కి వ్యాక్సిన్ వచ్చేసింది

ప్రపంచ దేశాలను ఎప్పటినుంచో వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్ . దాదాపు ప్రతి ఏడాది 10 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు. వారిలో వేళల్లో మరణలు సంభవిస్తున్నాయి. ఇలా ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని భయపెడుతూ భాదిస్తుంది. కొన్ని ఏళ్లుగా ఈ వ్యాధిని నివారించడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కొంతకాలం క్రిందట కొన్ని వ్యాక్సిన్స్ వచ్చినా కానీ అవి.. అంతంత మాత్రంగానే ప్రభావం చూపించాయి. అప్పటినుంచి కూడా దీనిపైన ఎన్నో ప్రముఖ సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఇకపై ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

మనుషులలో ఉండే రోగ నిరోధక శక్తికి దొరకకుండా… హెచ్ఐవి వైరస్ ప్రతిసారి మ్యుటేషన్స్ అవుతూనే ఉంది. దీనితో శాస్త్రవేత్తలకు. వైద్యులకు ఈ వ్యాధికి టీకాలను , మందులను కనిపెట్టడం కష్టతరంగా మారింది. ఇప్పటివరకు మొత్తంగా 7 వ్యాక్సిన్ డోసులను ప్రజలలోకి తీసుకుని వచ్చారు. కానీ అవేమి కూడా అంత ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలోనే ఎంఐటీ పరిశోధకులు హెచ్‌ఐవీని నివారించేందుకు ఓ కొత్త వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చారు. కొత్తగా తీసుకు వచ్చిన ఈ వ్యాక్సిన్ ఒక వారం వ్యవధిలోనే.. 2 డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. మొదటి డోస్ లో 20 శాతం వ్యాక్సిన్.. రెండో డోస్ లో 80 శాతం వ్యాక్సిన్ ను హెచ్ఐవి సోకిం రోగికి ఎక్కిస్తారు. ఇలా వారం వ్యవధిలోనే రెండు డోసులు ఎక్కించడంతో.. వైరస్ మ్యుటేషన్ జరిగే లోపు.. వ్యాక్సిన్ పని చేస్తుందని నిపుణులు తెలిపారు.

అయితే ఏ వ్యాక్సిన్ ను అయినా మొదట ఎలుకల మీద ప్రయోగిస్తారన్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు దీనిని కూడా మొదట అలా పరీక్షించి చూడగా.. దానికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇక ఇప్పుడు మనుషులపై ప్రయోగించిన తర్వాత కూడా ఇదే రెస్పాన్స్ వస్తే కనుక.. ఏళ్ళ తరబడి వెంటాడుతున్న ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు . త్వరలోనే దీనికి సంబంధించిన ఫలితాలను కూడా తెలియజేయనున్నారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. అలాగే అధికారికంగా ఈ వ్యాక్సిన్ ను ఇండియాలోకి ఎప్పుడు తీసుకుని వస్తారు అనే విషయాలపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే ఎంతో మందికి ఉపశమనం కలుగుతుంది. ఎంతో మందిని చావు నుంచి తప్పించినట్లు అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.